ప్రభుత్వ దవాఖానల్లో రోబోటిక్ సర్జరీ సేవలు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఆదివారం సనత్‌నగర్ టిమ్స్‌లో రాష్ట్రస్థాయి మల్టీస్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్‌షాప్ ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మెడికల్ రోబోటిక్ ఎక్విప్మెంట్, మౌలిక వసతుల ను పరిశీలించారు. వైద్య రంగంలో రోబోటిక్ సర్జరీ సేవలపై చర్చించారు.
- వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఆదివారం సనత్‌నగర్ టిమ్స్‌లో రాష్ట్రస్థాయి మల్టీస్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్‌షాప్ ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మెడికల్ రోబోటిక్ ఎక్విప్మెంట్, మౌలిక వసతుల ను పరిశీలించారు. వైద్య రంగంలో రోబోటిక్ సర్జరీ సేవలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. రాష్ట్రంలో ఆధునిక వైద్యసేవల విస్తరణకు ప్రభు త్వం ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపారు. వైద్యరంగంలో బ్రాండ్‌గా విస్తరించేందుకు టిమ్స్, కొత్తగా ఉస్మానియా దవాఖానలు నిర్మిస్తున్నామని, మెడికల్ కాలేజీలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రోబోటిక్ సర్జరీ పితామహుడు డా.సుధీర్ శ్రీవాత్సవ సేవలను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. ‘రాష్ట్రంలోని ఎంఎన్‌జే, టిమ్స్‌లు, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలతోపాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని జీజీహెచ్‌లలో అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సేవలను విస్తరించేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

