Minister Satyavathi Rathod | అట్టడుగువర్గాల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య : మంత్రి సత్యవతి రాథోడ్
ముఖ్యమంత్రి కేసీఆర్ (CMKCR) అట్టడుగువర్గాల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను ప్రైవేట్‌కు దీటుగా అందిస్తూ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని, కేజీ టూ పీజీ విద్యలో భాగంగా సీఎం కేసీఆర్ అనేక గురుకులాలను ఏర్పాటు చేశారని రాష్ట్ర, గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గురుకుల విద్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CMKCR) పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర, గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) అన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించిన గిరిజన గురుకుల విద్యార్థులతో బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం ప్రత్యేకంగా ముచ్చటించారు. సుమారు రూ.1.30 కోట్లతో 160 మంది విద్యార్థులకు ల్యాప్ టాప్స్, ఒక్కొక్కరికి రూ.50వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. అట్టడుగువర్గాల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను ప్రైవేట్‌కు దీటుగా అందిస్తూ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. కేజీ టూ పీజీ విద్యలో భాగంగా సీఎం కేసీఆర్ అనేక గురుకులాలను ఏర్పాటు చేశారని వివరించారు. గిరిజన బిడ్డలను విద్యావంతుల్ని చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపట్టారని, అందువల్లే గతంతో పోలిస్తే గిరిజనుల్లో అక్షరాస్యత శాతం ఇప్పుడు అత్యధికంగా పెరిగిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం గిరిజనుల కోసం ప్రత్యేకంగా 92 గురుకులాలని స్థాపించారని, వాటి ద్వారా వేలాది మంది గిరిజన చిన్నారులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందుతుందని వివరించారు. అంతే కాకుండా ఎక్స్‌లెన్స్ సెంటర్లను ఏర్పాటు చేసి ఐఐటీ, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీలకు ఉచిత శిక్షణ అందిస్తున్నారని, తద్వారా ప్రతి సంవత్సరం వందలాది మంది నిరుపేద విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో అడ్మిషన్ పొందుతూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.
ఐఐటీ విద్యార్థికి ల్యాప్‌టాప్, నగదు..
సీట్లు పొందిన ప్రతి ఐఐటీ విద్యార్థికి ఒక ల్యాప్‌టాప్, రూ.50 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తూ ఆర్థికంగా చేయూతనందిస్తున్నారని పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు సుమారు 1200 మంది గిరిజన విద్యార్థులు పలు ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఇంజినీరింగ్, వైద్య విద్య ఇతర కోర్సుల్లో ప్రవేశాలు పొందారని కొనియాడారు. ఏటికేడు ఆ సంఖ్య పెరుగుతున్నదని, అవన్నీ గురుకులాలు సాధిస్తున్న సత్ఫలితాలకు నిదర్శనమని కొనియాడారు.
ఈ ఏడాది ఇప్పటివరకు ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు పొందిన 160 మంది విద్యార్థులకు సుమారు రూ.1.30 ల్యాప్ టాప్‌లను, రూ.50వేల చొప్పున నగదు ప్రోత్సాహాకాన్ని అందించినట్లు వెల్లడించారు. ఇప్పటికీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నదని, అందులోనూ సీట్లు పొందినవారికి త్వరలో అందజేస్తామని మంత్రి వెల్లడించారు. గిరిజన విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థానాలకు చేరుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, ఓఎస్డీ రంగారెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేశం, ఓఎస్డీ కోటేశ్వరరావు, ప్రిన్సిపల్ రాజేంద్రనగర్ సురేందర్, వరంగల్ ప్రిన్సిపాల్ పద్మిని తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల్లో IIT /NIT/IIIT ల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ల్యాప్ టాప్స్ తో పాటు నగదు ప్రోత్సాహకాన్ని అందించి, విద్యార్థులను అభినందించడం జరిగింది. pic.twitter.com/LI05jwoADW
— Satyavathi Rathod (@Satyavathi_BRS) December 9, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

