కాంగ్రెస్ తెచ్చిన కరువు.. రాష్ట్రమంతా!
కాంగ్రెస్ సర్కారు అసమర్థ పాలన, అనాలోచిత నిర్ణయాలు, రాజకీయకక్ష సాధిం పు చర్యలు రాష్ర్టాన్ని కరువుకోరల్లోకి నెట్టాయి. నదీ జలాలను ఎత్తిపోయకుండా, కరెంటు ఇయ్యకుండా కరువును కొనితెచ్చి రైతు నెత్తిన పెట్టింది. రాష్ట్రంలో 365 మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నట్టు ప్రకటిస్తూ మంగళవారం జీవో విడుదల చేసింది. 33 జిల్లాలకుగాను 31 జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్టు ప్రకటించింది.
- రాష్ట్రంలోని 365 మండలాల్లో కరువు
- 111 మండలాల్లో తీవ్రం.. 254 మండలాల్లో మధ్యస్థ కరువు
- కరువు మండలాలపై ప్రభుత్వం జీవో జారీ
- కరువు సాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి
- పంటనష్ట పరిహారం భారం కేంద్రంపైనే
- కేంద్రం నుంచి విపత్తు నిధి వచ్చిన నెల రోజుల్లో..
- రైతులకు పంటనష్ట పరిహారం ఇస్తామని వెల్లడి
- 13.22 లక్షల ఎకరాలు తగ్గిన పంటల సాగు
- 18 శాతం తగ్గిన వరి సాగు విస్తీర్ణం
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు అసమర్థ పాలన, అనాలోచిత నిర్ణయాలు, రాజకీయకక్ష సాధిం పు చర్యలు రాష్ర్టాన్ని కరువుకోరల్లోకి నెట్టాయి. నదీ జలాలను ఎత్తిపోయకుండా, కరెంటు ఇయ్యకుండా కరువును కొనితెచ్చి రైతు నెత్తిన పెట్టింది. రాష్ట్రంలో 365 మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నట్టు ప్రకటిస్తూ మంగళవారం జీవో విడుదల చేసింది. 33 జిల్లాలకుగాను 31 జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్టు ప్రకటించింది. 65శాతం గ్రామీణం కరువుతో అల్లాడుతున్నదని ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో 111 మండలాల్లో తీవ్ర కరువు నెలకొనగా, మరో 254 మండలాల్లో మధ్యస్థ కరువు ఉన్నదని పేర్కొన్నది.
తగ్గిన సాగు విస్తీర్ణం..
వానాకాలం ఆరంభం నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వానకాలంలో వర్షపాతం 740.6 మిల్లీమీటర్లకుగాను 615.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17 శాతం మేర లోటు వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనే కనీస ఆలోచన, బాధ్యత గానీ కాంగ్రెస్ సరార్లో కానరాలేదు. సాగునీటి శాఖను గాలికొదిలేసి కాలయాపన చేయడంతో దీని ప్రభావం సాగుపై పడింది. ఏకంగా 18 ప్రధాన వ్యవసాయ జిల్లాల్లో పంటల సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. నిరుటితో పోలిస్తే రాష్ట్రంలో 13.21లక్షల ఎకరాల్లో సాగు పూర్తిగా తగ్గిపోయింది. సాధారణంగా 139.28 లక్షల ఎకరాలకు పైగా సాగు జరగాల్సి ఉండగా.. నీళ్లు కొరత, అప్రకటిత కరెంటు కోతలతో 126.06 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణం ఏకంగా 18 శాతం తగ్గిపోయింది. గతంలో దాదాపు 69.19 లక్షల ఎకరాల్లో సాగైన వరి, నేడు 57 లక్షల ఎకరాలకు పడిపోయింది.
నీళ్లు లేక వెలవెల
మరోవైపు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. గత పదేండ్ల కాలంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో, మిషన్ కాకతీయతో నిండుకుండల్లా మారిన రిజర్వాయర్లను, చెరువులను కాంగ్రెస్ పాలకులు తమ అస్తవ్యస్త విధానాలతో పూర్తిగా ఎండబెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రాజెక్టుల నిర్వహణ చేతకాక, నీటిని ఎప్పటికప్పుడు ఒడిసిపట్టే వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన, మధ్యతరహా ప్రాజెక్టుల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 585 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయాల్లో మిగిలి ఉన్నది కేవలం 179.63 టీఎంసీలు మాత్రమే. వచ్చే 10 నెలలు సాగు నీళ్లకు, తాగు నీళ్లకు కొరత తప్పదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇప్పటికే సాగుకు చుక్క నీళ్లు ఇవ్వలేమని సీఎం రేవంత్ చెప్పారు.
కరువు సాయం.. కేంద్రమే దిక్కు
దారుణమైన విషయం ఏమిటంటే, ఇంతటి పెను విపత్తులో రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా చేతులెత్తేసింది. పంట నష్టపోయిన బాధిత రైతులకు తన సొంత ఖజానా నుంచి పైసా సాయం చేసే ఆలోచన లేదని స్పష్టంగా తేల్చిచెప్పింది. ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టింది. జాతీయ విపత్తుల నిధి నుంచి పైసలు పంపిస్తే.. ఆ నిధులు అందిన నెల రోజుల్లోపు రైతులకు పంట నష్టపరిహారం పంచుతామని లిఖితపూర్వకంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కేంద్రం పైసలు విదిలిస్తేనే తాము రైతులకు ఇస్తామని, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా తన ఖజానా నుంచి ఇవ్వబోదని తేల్చి చెప్పింది. అసెంబ్లీలో ఒక తీర్మానం ఆమోదించి, కేంద్రం వెంటనే రూ.20 వేల కోట్ల రూపాయల ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేయనున్నట్టు పేర్కొంది.
దాంతోపాటు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 50 రోజుల అదనపు పనిదినాల ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించాలని, అదనంగా 1500 మెగావాట్ల విద్యుత్తు ఇవ్వాలని, రాష్ట్ర రుణ పరిమితిని 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని కోరుతూ ఢిల్లీకి ప్రతిపాదనలు పంపింది. కరువుతో అల్లాడుతున్న రైతులకు తక్షణ ఉపశమనం కలిగించాల్సిన ప్రభుత్వం, ఇలా నిబంధనలు, తీర్మానాలు అంటూ నెపాన్ని ఇతరులపైకి నెట్టేసి కాలం గడపాలని చూడటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రుణాల రికవరీని తక్షణమే నిలిపివేసి, రుణాలను రీషెడ్యూల్ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం జిల్లా కలెక్టర్లు బ్యాంకులతో మాట్లాడాలంటూ మొకుబడి ఆదేశాలు ఇచ్చి వదిలేసింది తప్ప, బలవంతపు వసూళ్లను అడ్డుకునేలా ఎలాంటి కఠినమైన ఉత్తర్వులు జారీ చేయలేదు.
సీఎం సొంత జిల్లాలో కరువు
సీఎం సొంత ఇలాకాలోనే కరువు కోరలు చాచి రైతన్నను నిలువునా ముంచేసింది. వికారాబాద్ జిల్లాలోని మొత్తం 20 మండలాలకుగాను 11 మండలాల్లో తీవ్రమైన కరువు తాండవిస్తున్నదని ప్రభుత్వం ప్రకటించింది. స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో సైతం అన్నదాతలకు నిరాశే మిగిలింది. పాలకుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టుల నుంచి చుక నీరు రాక, వానలు ముఖం చాటేసి.. వేసిన పత్తి, కంది, వరి పంటలు కండ్ల ముందే మాడిపోయి నేలపాలయ్యాయి. భూగ ర్భ జలాలు పాతాళానికి పడిపోయి బోర్లు సైతం ఎండిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తాగునీరు, మూగజీవాలకు గ్రాసం కూడా దొరుకని దుస్థితి నెలకొంది. సీఎం ఇలాకాలోనే సగానికిపైగా మండలాలు తీవ్ర కరువు బారినపడి విలవిలలాడుతున్నాయి.
ఎల్‌నినో, కరువు పరిస్థితులపై నేడు అఖిలపక్షం
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతం, కరువు పరిస్థితులపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరుగనున్నది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, లోటు వర్షపాతం నేపథ్యంలో ప్రజలు, రైతులపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

