Telangana | అంగన్వాడీలకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
Telangana | అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లుల విడుదల చేయాలని సూచించారు.
Telangana | అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను సైతం విడుదల చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలను ఆదివారం నాడు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలోని 70వేల మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు లబ్ధి పొందనున్నారు.
మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌తో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీల డిమాండ్లపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్వాడీల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. మిగిలిన డిమాండ్లపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ తెలిపారు. కాగా, తమ డిమాండ్లపై ప్రభుత్వ సానుకూల వైఖరిపై అంగన్వాడీ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eetha Trailer | ‘ఛావా’ దర్శకుడి కొత్త సినిమా.. శ్రద్ధా కపూర్ ‘ఈతా’ ట్రైలర్ విడుదల!
‘పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి’
Europe | వాతావరణ మార్పులతోనే యూరప్‌లో ఎండలు.. 50వేల మరణాలకు అవే కారణం..
‘సీతారామ ప్రాజెక్టుతో సింగరేణి మండలానికి ఒరిగిందేమీ లేదు’
Hansika | హన్సిక పేరుతో ప్రైవేట్ వీడియో కలకలం.. డీప్‌ఫేక్ ప్రచారంపై అసలు నిజం ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

