కోతల సర్కార్‌తో కన్నీళ్లే దిక్కు!
కరెంట్ కోతలను నిరసిస్తూ శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని అలంపల్లి శ్రీనివాస్ వరి పంటను పరిశీలించారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 16: కరెంట్ కోతలను నిరసిస్తూ శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని అలంపల్లి శ్రీనివాస్ వరి పంటను పరిశీలించారు. హనుమకొండ జిల్లా పరకాల సబ్‌స్టేషన్‌ను మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి సందర్శించారు. వనపర్తి జిల్లా కేతేపల్లి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు.
నల్లగొండ జిల్లా మర్రూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గంటపాటు ధర్నా నిర్వహించారు. మర్రూర్, మోదినిగూడెం గ్రామ శివారుల్లో ఎండిన పంటపొలాలను పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పంటపొలాలను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. పొలాల్లో ద్విచక్ర వాహనాలు నడిపి సర్కార్‌పై నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రైతుల సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
- లోవోల్టేజీతో కాలుతున్న మోటర్లు

మెదక్ జిల్లా కొల్చారంలో కరెంట్ సమస్య రైతులను పట్టిపీడిస్తున్నది. ఓవర్ లోడ్‌తో బోరు మోటర్లు కాలిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. బోరు మోటర్ కాలిపోవడంతో పైకి తీస్తున్న రైతు బాణయ్య.
– కొల్చారం

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికల్ సబ్‌స్టేషన్ వద్ద నిరసనలో పాల్గొన్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి, రైతులు, బీఆర్ఎస్ నాయకులు

వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం కేతేపల్లి సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఎండిన పొలంలో బైక్ నడుపుతూ నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

