సాయంత్రం 5 తర్వాత సాగుకు కరెంట్ బంద్
రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నది. పంటలు ఎండిపోతున్నాయి. ఈ తరుణంలో పొలాలను కాపాడేందుకు విద్యుత్తునందించాల్సిన సర్కార్ పూర్తిగా చేతులెత్తేసింది.
- ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకే త్రీఫేజ్
- మిగతా సమయాల్లో ఇవ్వలేకపోతున్న సర్కార్
- పీక్ డిమాండ్ సరికొత్త రికార్డు
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నది. పంటలు ఎండిపోతున్నాయి. ఈ తరుణంలో పొలాలను కాపాడేందుకు విద్యుత్తునందించాల్సిన సర్కార్ పూర్తిగా చేతులెత్తేసింది. సాయంత్రం 5 గంటల తర్వాత సాగుకు కరెంట్ ఇవ్వడం లేదు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు త్రీఫేజ్ విద్యుత్తును నిలిపివేస్తున్నారు. సాధారణంగా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పొలానికి నీరందిస్తేనే మంచి దిగుబడి వస్తుంది.
కానీ సర్కార్ మాత్రం ఉదయం 8 గంటల తర్వాతే త్రీఫేజ్ విద్యుత్తు అందిస్తున్నది. ఎండ తీవ్రత పెరిగిన తర్వాత నీళ్లు పారిస్తుండటంతో ఆవిరవుతున్నాయి. పొలాలు ఎండమావులను తలపిస్తున్నాయి. విద్యుత్తు కోతలపై ఇటీవలే సీఎం రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. అయినా పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. వ్యవసాయానికి అంతరాయం లేని, కోతల్లేని విద్యుత్తును అందించలేకపోతున్నారు.
డిమాండ్ పెరిగిందో.. ఫీడర్లకు కట్
రాష్ట్రంలో విద్యుత్తు డిమాం డ్ హెచ్చుతగ్గులు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రిడ్ నిర్వహణకు సవాల్గా మారుతున్నాయి. గ్రిడ్ ఫ్రీక్వెన్సీ గంట గంటకూ మారుతున్నది. రాష్ట్ర అవసరాల మేరకు తగిన విద్యుత్తు అందించకపోవడంతో గ్రిడ్ సురక్షితమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శనివారం ఒక్క రోజే విచిత్ర పరిస్థితి ఎదురైంది.
శనివారం ఉదయం 10:49 గంటలకు గరిష్ఠ డిమాండ్ 18,718 మోగావాట్లు ఉండగా, తర్వాత క్రమంగా పడిపోయింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఉన్నట్టుండి 12 వేల మెగావాట్లకు పడిపోయింది. రాత్రి 6:40 గంటలకు 10 వేల మెగావాట్లకు పడిపోయింది. శుక్రవారం సాయంత్రం పూట 11,735 మెగావాట్లున్నది. ఈ హెచ్చతగ్గులు గ్రిడ్ నిర్వహణపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. డిమాండ్ పెరిగిన ప్రతిసారీ వ్యవసాయ ఫీడర్లకు విద్యుత్తు కోత పెడుతున్నారు.
పీక్ డిమాండ్ 20,018 మెగావాట్లు
ఇక రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ రికార్డుల మోత మోగిస్తున్నది. ఈ నెల 15న పీక్ డిమాండ్ 20,003 మెగావాట్లుగా నమోదు కాగా, ఈ రికార్డును కూడా రాష్ట్రం తిరగరాసింది. ఈ నెల 16న గరిష్ఠ డిమాండ్ 20,018 మెగావాట్లుగా రికార్డయ్యింది. అంతేకాకుండా విద్యుత్తు వినియోగం కూడా పెరుగుతున్నది.
ఈ ఏడాది మార్చి 13న 341.08 మిలియన్ యూనిట్లు కాగా ఇప్పటి వరకు ఇదే రికార్డు. తాజాగా అక్టోబర్ 16న 335.06 మిలియన్ యూనిట్లకు చేరింది. ఐదు రోజుల నుంచి రాష్ట్రంలో వినియోగం క్రమంగా పెరుగుతుండటం, పీక్ డిమాండ్ 20 వేల మెగావాట్లు దాటడం ఆందోళన రేపుతున్నది. రాబోయే రోజుల్లో సంక్షోభం తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

