పోలీసు శాఖలో సాంకేతిక విప్లవం
తెలంగాణ పోలీసు వ్యవస్థను మరింత ఆధునికీకరిస్తూ, ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన, సమర్థవంతమైన సేవలను అందించేందుకు పోలీస్‌శాఖ సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా నేర పరిశోధన విభాగం (సీఐడీ) రూపొందించిన ఏడు నూతన డిజిటల్ సేవలను డీజీపీ సీవీ ఆనంద్ డీజీపీ కార్యాలయంలో బుధవారం ప్రారంభించారు. పోలీసు సేవలను వినియోగించుకున్న వారినుంచి నేరుగా స్పందన తెలుసుకునేందుకు సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్ (సీఎఫ్‌సీ) ప్రారంభించారు.
- 7 నూతన డిజిటల్ సేవలను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసు వ్యవస్థను మరింత ఆధునికీకరిస్తూ, ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన, సమర్థవంతమైన సేవలను అందించేందుకు పోలీస్‌శాఖ సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా నేర పరిశోధన విభాగం (సీఐడీ) రూపొందించిన ఏడు నూతన డిజిటల్ సేవలను డీజీపీ సీవీ ఆనంద్ డీజీపీ కార్యాలయంలో బుధవారం ప్రారంభించారు. పోలీసు సేవలను వినియోగించుకున్న వారినుంచి నేరుగా స్పందన తెలుసుకునేందుకు సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్ (సీఎఫ్‌సీ) ప్రారంభించారు.
ఇది పిటిషన్లు, ఎఫ్ఐఆర్లు, ఈ-చలాన్లు, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సేవల నాణ్యతను సమీక్షిస్తుంది. అదేవిధంగా, మహిళా భద్రతా విభాగం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా రాష్ట్రంలోని 35 భరోసా కేంద్రాలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చారు. ప్రజలకు సీఐడీ సేవలు చేరువయ్యేలా నూతన వెబ్‌సైట్‌ను కూడా ఆవిషరించారు. నేర పరిశోధనలో వేగం, కచ్చితత్వాన్ని పెంచేందుకు ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్ యాప్‌లను వినియోగించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

