‘ముదిరాజ్’లపై తొందరపాటు వద్దు
సమగ్రమైన అధ్యయనం చేశాకే ముదిరాజ్ కులస్తులను బీసీ-డీ గ్రూప్ నుంచి ఏ గ్రూప్‌లోకి మార్చే అవకాశం ఉంటుందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడించారు. బీసీ కార్పొరేషన్లకు కేటాయించిన నిధులను విడుదల చేయడం లేదని, తద్వారా రెండేండ్లకాలం వృథాగా పోయిందని ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాయలంలో ఆయన నేతృత్వంలో బీసీ కమిషన్ సభ్యులు జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మి బుధవారం సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
- సమగ్ర అధ్యయనం తర్వాతే బీసీ-ఏ గ్రూప్‌లోకి మార్పునకు అవకాశం
- రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన నిరంజన్
- రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతప్తి
హైదరాబాద్, అక్టోబర్28 (నమస్తే తెలంగాణ): సమగ్రమైన అధ్యయనం చేశాకే ముదిరాజ్ కులస్తులను బీసీ-డీ గ్రూప్ నుంచి ఏ గ్రూప్‌లోకి మార్చే అవకాశం ఉంటుందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడించారు. బీసీ కార్పొరేషన్లకు కేటాయించిన నిధులను విడుదల చేయడం లేదని, తద్వారా రెండేండ్లకాలం వృథాగా పోయిందని ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాయలంలో ఆయన నేతృత్వంలో బీసీ కమిషన్ సభ్యులు జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మి బుధవారం సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
ప్రధానంగా కులవృత్తుల ఆధునికీకరణకు ఆయా కులస్తులు, మేధావుల సలహాలు, సూచనలు ఆహ్వానించాలని కమిషన్ నిర్ణయించింది. ఇటీవల ముదిరాజ్‌లను బీసీ డీ గ్రూప్‌లోకి మారుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై కమిషన్ సుదీర్ఘంగా చర్చించింది. ప్రస్తుతం బీసీ-ఏ గ్రూప్‌లోని 57 కులాలు, ‘డీ’ గ్రూప్‌లోని 34 కులాలపై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాతే ముదిరాజ్‌ల గ్రూప్ మార్పుపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందని కమిషన్ అభిప్రాయపడింది.
బీసీ-డీ గ్రూప్ నుంచి ‘ఏ’ గ్రూప్‌నకు మార్చాలని కోరుతున్న సగర, ఉప్పర కులస్తుల వినతిని సమగ్ర సమాచారం వచ్చిన తర్వాతే పరిశీలించాలని నిర్ణయించింది. కార్యాలయంలోని గ్రంథాలయానికి బీపీ మండల్ గ్రంథాలయంగా, సమావేశ మందిరానికి కేఎన్ అనంతరామన్ సమావేశ మందిరంగా నామకరణం చేయాలని నిర్ణయించింది. బీసీ సంక్షేమశాఖ పరిధిలోని 22 కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు 2026-27 సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వం రూ.2,592.93 కోట్లు కేటాయించినా, ఆ నిధులను ఇప్పటికీ విడుదల చేయలేదంటూ కమిషన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది.
సెస్ డైరెక్టర్‌తో భేటీ
సెంటర్ ఫర్ ఎకనమిక్, సోషల్ స్టడీస్ (సెస్) డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతితో కమిషన్ ప్రత్యేక భేటీ అయింది. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని లొద్ద కులస్తుల సామాజిక, ఆర్థిక, విద్య, జీవన స్థితిగతులను అధ్యయనం చేయించాలని కమిషన్ ఇదివరకే నిర్ణయించింది. సమావేశంలో కమిషన్ మెంబర్ సెక్రటరీ బాల మాయదేవి, ప్రత్యేక అధికారి సునీత, సెక్షన్ ఆఫీసర్లు సతీశ్‌కుమార్, ఇర్ఫాన్ బిన్ ఖలీద్, రీసెర్చ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

