ఉన్నత విద్యలో ఉత్తమ స్థానం

- జీఈఆర్‌లో 9వ స్థానంలో తెలంగాణ
- జాతీయ సగటుకు మించి ప్రవేశాలు
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యలో తెలంగాణ ప్రగతిపథాన దూసుకుపోతున్నది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో పెద్దపెద్ద రాష్ర్టాలను వెనక్కి నెట్టి 9వ స్థానంలో నిలిచింది. జాతీయ సగటును మించి మనరాష్ట్రంలో ప్రవేశాలు జరుగుతున్నాయి. 2020-21 సంవత్సరంలో తెలంగాణ ఉన్నత విద్యలో 9వ వస్థానంలో నిలిచినట్టు ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదిక వెల్లడించింది. సోషియో ఎకనామిక్ సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పొందుపరిచింది. ప్రతి లక్ష మందికి కళాశాలల రేషియో తెలంగాణలో 50 ఉంటే, దేశవ్యాప్తంగా 28 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కళాశాలల్లో సరాసరి ఎన్రోల్మెంట్ విషయంలో తెలంగాణలో ఒక కళాశాలలో 554 మంది చేరుతుండగా, జాతీయ స్థాయిలో 693 మంది చేరుతున్నారు.
అవకాశాలు పుష్కలం..
ఉన్నత విద్యారంగంలో రాష్ట్రంలో అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. రాష్ట్రంలో 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, 2,656 కళాశాలలున్నాయి. ఉస్మానియా, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు యూజీసీ ప్రచురించిన యూనివర్సిటీస్ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్స్ జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం. దేశంలోనే అత్యుత్తమ న్యాయ కళాశాల నల్సార్ మనదగ్గరే ఉన్నది. ఐఐటీతోపాటు, ఫార్మసీలో ప్రతిష్ఠాత్మక నైపర్ విద్యాసంస్థలు ఉన్నాయి. ఫలితంగా తెలంగాణ ఎడ్యుకేషన్ హబ్‌గా అవతరించింది. అనేక రాష్ర్టాల నుంచేకాకుండా విదేశాల నుంచి కూడా విద్యార్థులు ఉన్నత విద్యకోసం మన రాష్ర్టానికి వస్తున్నారు. అంతర్జాతీయంగా ఉత్తమ అవకాశాలున్న ప్రతీకోర్సు ఇక్కడ లభిస్తున్నది. 2014-15లో ప్రభుత్వ డిగ్రీకాలేజీల్లో 22 వేలమంది మాత్రమే చేరగా, 2020-21లో 46,194 మంది ప్రవేశాలు పొందారు. కొత్తగా 5 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Uttarakhand: బద్రీనాథ్‌లో హెలికాప్టర్ మిస్సింగ్
Jumanji: Open World | థ్రిల్లింగ్ అడ్వెంచర్‌తో వస్తోన్న ‘జుమాంజి: ఓపెన్ వరల్డ్’.. తెలుగు ట్రైలర్ విడుదల!
Robin Uthappa: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప
Women Prisoners Karwa Chauth | జైలులో మహిళా ఖైదీల కర్వా చౌత్.. ఫోన్లలో భర్త ఫొటోలు చూసి ఉపవాస దీక్ష విరమణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

