తానా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ పదవులకు జరిగే ఎన్నికల కోసం ఐనంపూడి కనకంబాబు నేతృత్వంలోని ఎన్నికల కమిటీ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
- ఈ నెల 16 వరకు నామినేషన్ల స్వీకరణ
- ఏప్రిల్ 22న ఓట్ల లెక్కింపు, 23న ఫలితాల వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ పదవులకు జరిగే ఎన్నికల కోసం ఐనంపూడి కనకంబాబు నేతృత్వంలోని ఎన్నికల కమిటీ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అదే నెల 23న పరిశీలన ఉంటుంది. మార్చి 2న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు. మార్చి 5న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. యూఎస్పీఎస్ ఫస్ట్‌క్లాస్ బ్యాలెట్ మెయిలింగ్ ద్వారా మార్చి 23 వరకు ఓటింగ్ కొనసాగుతుంది. ఏప్రిల్ 21 వరకు బ్యాలెట్ పత్రాలను స్వీకరిస్తారు. ఏప్రిల్ 22న ఓట్ల లెక్కింపు, మరుసటి రోజు 23న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. నాలుగేండ్ల కాలపరిమితితో నాలుగు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ స్థానాలు, ఫౌండేషన్‌లో 7 స్థానాలు, రెండేండ్ల కాలపరిమితికి 29 ఎగ్జిక్యూటివ్ కమిటీ స్థానాల కోసం ఈ ఎన్నికలు జరుగనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

