ఇదే తొలిసారి.. తెలంగాణ హైకోర్టులో ఒకేసారి ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణం
Telangana High court | తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణం చేశారు. హైకోర్టు ఫస్ట్ కోర్టు హాలు వేదికగా ఈ ఉదయం 10.30 గంటలకు కొత్త న్యాయమూర్తుల చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్

హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణం చేశారు. హైకోర్టు ఫస్ట్ కోర్టు హాలు వేదికగా ఈ ఉదయం 10.30 గంటలకు కొత్త న్యాయమూర్తుల చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ప్రమాణం చేయించారు. న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన వారిలో జస్టిస్ పెరుగు శ్రీ సుధా, జస్టిస్ డాక్టర్ చిల్లకూరు సుమలత, జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి, జస్టిస్ మున్నూరి లక్ష్మణ్, జస్టిస్ ఎన్ తుకారాం జీ, జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి, జస్టిస్ పటోళ్ల మాధవి దేవీ ఉన్నారు.
తెలంగాణ హైకోర్టు ఏర్పడ్డాక తొలిసారి ఏడుగురు న్యాయాధికారులకు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. కొత్త న్యాయమూర్తులు ఈ నెల 18న ప్రమాణం చేయాలని తొలుత భావించారు. విజయదశమి పండుగ నాడు ప్రమాణం చేసేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపడంతో తేదీని శుక్రవారానికి మార్చారు. ఒకేసారి ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణం చేయడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టీఏజీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ
RS Praveen Kumar | హైదరాబాద్‌లో టెర్రర్ అటాక్స్ ఉన్నాయనే కాన్ఫిడెన్షియల్ మెసేజ్ సోషల్ మీడియాలోకి ఎలా వెళ్లింది?
Sheikh Hasina | చేతులకు సంకెళ్లతో మాత్రమే స్వదేశానికి షేక్ హసీనా : బంగ్లాదేశ్
Boat Missing | ఏడుగురు మత్స్యకారుల బోటు గల్లంతు..కుటుంబ సభ్యుల్లో ఆందోళన
Dhanush | 2027 స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ధనుష్ వ్యూహం.. రాష్ట్రవ్యాప్తంగా సేవా విభాగాల బలోపేతం
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

