Home
Telangana
Suo Motu Case Registered Over Food Poisoning Incident Hrc Chairperson Shameem Akther Orders Submission Of A Report
ఫుడ్ పాయిజన్ ఘటనపై సుమోటో కేసు.. నివేదిక ఇవ్వాలని హెచ్ఆర్సీ చైర్పర్సన్ షమీమ్ అక్తర్ ఆదేశం
వనపర్తి జిల్లా పెబ్బేరులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది.
హైదరాబాద్/సుల్తాన్‌బజార్ అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లా పెబ్బేరులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. హాస్టల్లో ఉంటున్న సుమారు 50 మంది విద్యార్థినులు 7వ తేదీ రాత్రి భోజనం తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారని పేరొంటూ ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక రాసిన కథనాన్ని కమిషన్ సుమోటోగా తీసుకుంది.
హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులకు సరఫరా చేసే ఆహార నాణ్యత, ఆరోగ్యం, సకాలంలో వైద్య సేవలు అంశాలపై తీవ్ర ఆందోళనలు తలెత్తుతున్నాయని కమిషన్ పేర్కొంది. ఘటనకు దారితీసిన పరిస్థితులు, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి, అందించిన వైద్యం తదితర వివరాలతో సమగ్ర నివేదికను నవంబర్ 6వ తేదీ నాటికి సమర్పించాలని వనపర్తి కలెక్టర్‌ను ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

