ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు ఇవ్వని అధికారులు
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపత్రాలు ఇవ్వడం లో అధికారులు నిరాకరించడంలో ఆంతర్యమేంటని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా హత్నూర రైతువేదికలో మండలంలోని అంగన్‌వాడీటీచర్లకు సెల్ఫోన్లు పంపిణీచేశారు.
- పైశాచిక ఆనందం పొందుతున్న కాంగ్రెస్ నాయకులు
- రైతువేదికవద్ద ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి నిరసన
హత్నూర, మే 7 : లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపత్రాలు ఇవ్వడం లో అధికారులు నిరాకరించడంలో ఆంతర్యమేంటని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా హత్నూర రైతువేదికలో మండలంలోని అంగన్‌వాడీటీచర్లకు సెల్ఫోన్లు పంపిణీచేశారు. ఎమ్మెల్యే కోటాకింద మం డలానికి మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు ఇవ్వాలని ఎంపీడీవో శంకర్‌ను కోరగా నిరాకరించడంతో తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపత్రాలు ఇస్తామని ముందుగా చెప్పడంతోనేకదా లబ్ధిదారులను కార్యక్రమానికి తీసుకువచ్చింది అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కలెక్టర్‌తోపా టు గృహనిర్మాణశాఖ పీడీకి ఫోన్‌చేసి అరగంటలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపత్రాలు ఇవ్వాలని ఆదేశించారు. ఎంతసేపటికీ వాని నుంచి సమాధానం రాకపోవడంతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నరసన వ్యక్తం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావడంతోనే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. కళ్యాణలక్ష్మీ చెక్కు లు, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఇవ్వకుండా అడ్డుకుంటూ కాంగ్రెస్ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

