నీట్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం.. పరీక్షను ఎన్టీఏతో నిర్వహించొద్దు
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నీట్ వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశాయి. హైదరాబాద్‌లోని ముఖ్దూం భవన్లో వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం సమావేశం నిర్వహించాయి.
- వామపక్ష విద్యార్థి సంఘాలు
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నీట్ వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశాయి. హైదరాబాద్‌లోని ముఖ్దూం భవన్లో వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఎన్టీఏ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించాయి.
నీట్ పరీక్షను ఎన్టీఏతో నిర్వహించకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీకయ్యిది.”అని చెప్పడం అత్యంత దుర్మార్గపు, బాధ్యతారాహిత్య ప్రకటన అని మండిపడ్డారు. సమావేశంలో కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్టా లక్ష్మణ్(ఎఐఎస్ఎఫ్), టీ నాగరాజు, డీ కిరణ్ (ఎస్ఎఫ్ఐ), అనిల్,(పీడీఎస్‌యూ) పీ మహేశ్, పొడపంగి నాగరాజు (పీడీఎస్‌యూ), విజయ్ (పీడీఎస్‌యూ విజృంభణ), నితీశ్(ఎఐడీఎస్వో), ఎస్.నాగేశ్వరరావు (జార్జ్జిరెడ్డి పీడీఎస్‌యూ), పల్లె మురళి (ఏఐఎప్డీఎస్) తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

