రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి : మంత్రి సత్యవతి
రాష్ట్ర బీజేపీ నేతలు | కేంద్ర ప్రభుత్వం ఏడాది కింద తెచ్చిన వ్యవసాయ చట్టాలు అనాలోచితంగా తీసుకొచ్చినవని, వాటివల్ల రైతులకు అన్యాయం జరిగిందని దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పి ఉపసంహరించుకున్నారు. ఏడాది కాలంగా వీటిని సమర్థిస్తూ మాట్లాడిన బీజేపీ రాష్ట్ర నేతలు కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.

మహబూబాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఏడాది కింద తెచ్చిన వ్యవసాయ చట్టాలు అనాలోచితంగా తీసుకొచ్చినవని, వాటివల్ల రైతులకు అన్యాయం జరిగిందని దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పి ఉపసంహరించుకున్నారు. ఏడాది కాలంగా వీటిని సమర్థిస్తూ మాట్లాడిన బీజేపీ రాష్ట్ర నేతలు కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా బీజేపీ కండ్లు తెరిచి రైతు సమస్యలు తెలిసిన, రైతు ప్రయోజనాలు కాపాడే నేతలను పిలిపించుకుని మాట్లాడి రైతుమేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. జిల్లా మరిపెడ మండలం తాళ్ల ఊకళ్లు గ్రామంలో సోమవారం ఉమామహేశ్వర దేవస్థానంలో లింగ పునఃప్రతిష్ట, ధ్వజస్థంభం ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని మాట్లాడారు.
కార్తీక సోమవారం రోజున ఉమా మహేశ్వర స్వామి లింగ పునః ప్రతిష్ట, ధ్వజ స్థంభం ప్రతిష్ట చేసుకోవడం, అందులో భాగం కావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు. గ్రామస్థులందరికి అందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్కరూ సుఖ, సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.

నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేస్తున్నారు. ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎఎస్ పార్టీదే అన్నారు. ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ పై ఉన్న ఆదరాభిమానాలు, కేసీఆర్ నాయకత్వంపై ఉన్న గురికి ఈ విజయాలు నిదర్శనం అన్నారు. రైతులకు ఏం కావాలో అది సాధించడానికి సీఎం కేసిఆర్ పనిచేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. బీజేపీ ప్రభుత్వం కొంతమంది ప్రయోజనాల కోసం పనిచేయడం మానుకోవాలి. లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారు, విలాసవంతమైన జీవితం గడిపేందుకు వీలుగా విదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు.
ఇలాంటి వారికోసం కాకుండా రైతుల కోసం, సామాన్యుల కోసం పనిచేస్తే మంచిదని హితవు పలికారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు శ్రీనివాసరెడ్డి, యాదగిరి రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్, మనోజ, సత్యనారాయణ రెడ్డి, గ్రామ ముఖ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | ఆకాశంలో ఓ తార ట్రైలర్ విడుదల.. అమ్మాయి కలకు అండగా దుల్కర్ సల్మాన్..!
AI Technology: ఏఐ టెక్నాలజీ రక్షణ కోసం శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్.. సంతకం చేసిన భారత్
Thailand | థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 36 మందికి గాయాలు
KTR | ఇటీవల నిన్ను విన్న జోకుల్లో ఇదే బెస్ట్.. ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్
AR Constable | గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

