హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహం అనుసరిస్తున్నది. దేశంలోని ఏ ఇతర నగరాల్లో లేనంత వేగంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది.
ట్రాఫిక్ పద్మవ్యూహాలను చీల్చుకుంటూ సాకారమవుతున్న వ్యూహాత్మకదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) మొదటి దశలో రూ.4,357.85 కోట్లతో చేపట్టిన 33 ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి.
మొత్తం ప్రాజెక్టులు 47
అంచనా వ్యయం 8,052.92 కోట్లు
ఓఆర్ఆర్ నుంచి మెదక్ సెక్షన్ రోడ్డు పునరుద్ధరణ.
వివిధ దశల్లో పురోగతిలో 14
అందులో ఫ్లై ఓవర్లు : 17
అండర్‌పాస్‌లు : 5
ఆర్వోబీ/ఆర్‌యూబీలు : 7
కేబుల్‌బ్రిడ్జి : 1
విస్తరించిన బ్రిడ్జి : 1
ఎస్సార్డీపీ ఫేజ్-2
అనుమతులు లభించిన ప్రాజెక్టుల వ్యయం 3,115 కోట్లు