ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్పోర్ట్స్ స్టేడియాలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ స్టేడియాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఇప్పటికే 50 శాతానికి పైగా స్టేడియంల నిర్మాణ పనులను పూర్తి చేసినట్లు మిగిలినవి కూడా త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు.
2021 ఒలింపిక్ దినోత్సవ వేడుకలకు సంబంధించి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ బుధవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలను అనుసరించి క్రీడలను ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. నూతన క్రీడా విధానాన్ని రూపొందించేందుకు సీఎం క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారన్నారు.
ఐటి మంత్రి కేటీఆర్ సూచనల మేరకు తాము కార్పొరేట్ కంపెనీల సీఎస్ఆర్ నిధుల సహాయంతో క్రీడలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌లో సానియా మీర్జా, సాయి ప్రణీత్ రాణించగలరని, రాష్ట్రానికి పురస్కారాలను తెస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

