Speaker Pocharam | ప్రభుత్వ హయాంలో నెరవేరిన గిరిజన, బంజారుల కల : స్పీకర్ పోచారం
Speaker Pocharam | ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన, బంజారాల దశాబ్దాల కలలను నిజం చేసిన గొప్ప వ్యక్తని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి(Speaker Pocharam) అన్నారు.
కామారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన, బంజారాల దశాబ్దాల కలలను నిజం చేసిన గొప్ప వ్యక్తని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి(Speaker Pocharam) అన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన తెలంగాణ గిరిజనోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.7 కోట్లతో నిర్మిస్తున్న గిరిజన బాలుర వసతి గృహం, సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
స్పీకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి నేటి వరకు గిరిజనులకు ప్రభుత్వం మొత్తం రూ. 53,417 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 3146 తాండాలను, గూడేలను గ్రామ పంచాయతీ(Grama Panchayat) లుగా మార్చారని వివరించారు.గిరిజన రిజర్వేషన్ల(Reservations)ను ఆరుశాతం నుంచి 10 శాతానికి పెంచారని వెల్లడించారు. కల్యాణ లక్ష్మి(Kalyana laxmi) పథకం ద్వారా లక్షా 55వేలమంది గిరిజన యువతులకు రూ.1,306 కోట్ల నగదు సహాయాన్ని అందించారని చెప్పారు.
రైతుబంధు పథకం ద్వారా 8.2 లక్షల మంది గిరిజన రైతులకు రూ. 8305 కోట్లు, 3.5 లక్షల మంది గిరిజను లకు ఆసరా పెన్షన్ల కింద రూ.4,500 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తరువాతనే సేవాలాల్ మహారాజ్ పుట్టినరోజును అధికారికంగా జరుపుతున్నామని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని 1.50 లక్షల మంది గిరిజన రైతులకు నాలుగు లక్షలకు ఎకరాలకు పైగా పోడు భూములకు చెందిన పట్టాలను ప్రభుత్వం అందించనుందని తెలిపారు. 98 గిరిజన గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి , బాన్సువాడ, బోధన్ ఆర్డీవోలు రాజాగౌడ్, రాజేశ్వర్, ప్రజాప్రతినిధులు, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, మోహన్ నాయక్, బద్యా నాయక్, పెర్క శ్రీనివాస్, మాజీద్, విఠల్, ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

