Adilabad | ఆదిలాబాద్‌లో స్కూల్ పిల్లలపై విషప్రయోగం.. 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంక్‌లో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్రిపై కూడా పురుగుల మందులు చల్లారు.
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంక్‌లో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్రిపై కూడా పురుగుల మందులు చల్లారు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పాఠశాలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో పాఠశాలలోని వంట గదికి సిబ్బంది తాళాలు వేసుకుని వెళ్లారు. సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన సిబ్బంది వంట చేసేందుకు పాత్రలు కడిగే సమయంలో దుర్వాసన, నురగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాల హెడ్ మాస్టర్, సిబ్బంది చుట్టుపక్కల చూడగా పురుగుల మందు డబ్బా కనిపించింది. అలాగే తాగు నీటి ట్యాంక్‌లోనూ పురుగుల మందు కలిపినట్లుగా సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది.. విద్యార్థులను తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా చూశారు. మధ్యాహ్న భోజనం వండలేదు. ఈ ఘటనపై ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సరైన సమయానికి పాఠశాల సిబ్బంది గుర్తించి మధ్యాహ్న భోజనం వండకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ధర్మపురి పాఠశాలలో దాదాపు 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా విష ప్రయోగం నుంచి బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనపై పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు మండిపడుతున్నారు. అసలు స్కూల్ పిల్లలపై విష ప్రయోగం చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని.. చిన్న పిల్లలు ఏం పాపం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
మరణంలోనూ మహాదానం.. 8 మందికి ప్రాణం పోసిన టీచర్ నీరజారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

