వనపర్తి, డిసెంబర్ 30: బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో కొందరు కండక్టర్లు ఇష్టారీతిన టికెట్లు కొడుతున్నారు. శనివారం పెబ్బేరు నుంచి వనపర్తికి వెళ్తున్న ఎక్స్ప్రెస్ బస్సులో పదేండ్ల చిన్నారికి కండక్టర్ ఫుల్ టికెట్ ఇచ్చాడు.
ఫుల్ టికెట్ ఎందుకిచ్చారని ఆమె సోదరుడు ప్రశ్నిస్తే.. ‘రాష్ట్రంలో ఎవరికి లేని బాధ నీకేందుకు’ అంటూ దురుసుగా మాట్లాడినట్టు ఆ యువకుడు తెలిపాడు.