హవాలా తరహాలో ఓటర్లకు డబ్బులు!
ఓటర్లకు చీరలు, కుక్కర్లు, మందుబాటిళ్లు, డబ్బులు పంచటం సాధారణంగా కనిపించేదే. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ప్రలోభాలు హైటెక్ పద్ధతిలో కొనసాగాయి. హవాలా మార్గంలో డబ్బులు చేతులు మారినట్టుగా ఓటరుకు ముట్టజెప్పడం అచ్చం మాఫియాను తలపిస్తున్నది.
- చేతుల్లోనే ప్రింటర్లు.. టోకెన్ల పంపిణీ
- మొబైల్ సాఫ్ట్‌వేర్‌లో ఎంట్రీతో ధ్రువీకరణ
- చీకటి గదుల్లోకి తీసుకెళ్లి నగదు అందజేత
- కాంగ్రెస్ మాఫియాపై ఓ జూబ్లీహిల్స్ ఓటరు పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్
- చెక్‌పోస్టులు, తనిఖీలు ఎందుకని నిలదీత
- పోలీసు బలగాల నిఘా ఏమైందని ప్రశ్న
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10(నమస్తే తెలంగాణ): ఓటర్లకు చీరలు, కుక్కర్లు, మందుబాటిళ్లు, డబ్బులు పంచటం సాధారణంగా కనిపించేదే. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ప్రలోభాలు హైటెక్ పద్ధతిలో కొనసాగాయి. హవాలా మార్గంలో డబ్బులు చేతులు మారినట్టుగా ఓటరుకు ముట్టజెప్పడం అచ్చం మాఫియాను తలపిస్తున్నది. జూబ్లీహిల్స్ బస్తీల్లో ఇంటింటికి డబ్బులు ఎలా పంచుతున్నారో తనకు ఎదురైన అనుభవాన్ని కండ్లకు కట్టినట్టు వివరిస్తూ ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రెడిట్‌లో పోస్ట్పెట్టగా అది వైరల్‌గా మారింది.
- ముందుగాఒక చీకటి గల్లీలోకి తీసుకెళ్లారు. అక్కడ ఫ్యాన్సీ టేబుల్ సెటప్ మీద మినీప్రింటర్లతో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.
- ఓటర్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు చూపించమన్నారు. ఆ కార్డును కాంగ్రెస్ వాళ్లు.. ఒక సాఫ్ట్‌వేర్‌లో ఎంటర్ చేసి ధ్రువీకరించుకున్నారు. ఆ తర్వాత పేరు, పోలింగ్ బూత్ నంబర్, సీరియల్ నంబర్, ఓటరు గుర్తింపు కార్డు నంబర్ వంటి వివరాలతో కూడిన ఒక టోకెన్ ప్రింట్ చేశారు.
- తర్వాత ఆ స్లిప్ నా చేతికి అందించి, నాతోపాటు మరో వ్యక్తిని ఇచ్చి పంపించారు. అతను మరొక గల్లీలోకి తీసుకెళ్లి, అక్కడ ఉన్న కాంగ్రెస్ మద్దతుదారుల దుకాణాల్లో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఓ టైలర్ షాపులోకి వెనుక డోర్ నుంచి తీసుకెళ్లారు.
- పదడుగుల పొడవు, పదడుగుల వెడల్పు విస్తీర్ణం గల చీకటి గదిలో డబ్బుల సంచులతో కొంతమంది ఉన్నారు. వారి దగ్గర అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ లిస్ట్ ఉంది. వాళ్లు నా టోకెన్ తీసుకుని, ఓటర్ లిస్టులో వివరాలతో సరి చూసుకున్నారు. తర్వాత ఆ టోకెన్‌పై రైట్ టిక్కు పెట్టుకుని వేరొకరికి ఇచ్చారు. ఆ వ్యక్తి చిరిగిన టోకెన్ పట్టుకుని వచ్చి నా చేతికి రూ.2500 ఇచ్చాడని ఆ ఓటరు వివరించారు.
నిఘా నేత్రాలు కండ్లు మూసుకున్నయా?
జూబ్లీహిల్స్‌లో ఓట్ల కొనుగోలు, కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు మొత్తం పోలీసులు, ఎన్నికల అధికారులకు తెలిసే జరుగుతున్నాయని సదరు ఓటరు ఆరోపించారు. ఇంత దారుణంగా డబ్బుల పంపిణీ జరిగిపోతుంటే… చెక్‌పోస్టులు ఎందుకు? సాధారణ ప్రజల వాహనాలను తనిఖీ చేయడమెందుకు? అని ప్రశ్నించారు. మరణం అంచుల్లో ఉన్న కాంగ్రెస్సే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇంకెంత చేయగలదో ప్రజలే ఆలోచించాలని కోరారు. ప్రధాని మోదీ ఓట్‌చోర్ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేస్తున్న ఆరోపణలను కూడా ప్రస్తావించారు. మోదీ ఓట్ చోర్ అయితే.. రాహుల్‌గాంధీ ఓట్ల కొనుగోలుదారుడా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు తనకు ఇచ్చిన రూ.2500 పేదవాడైన తన వాచ్‌మ్యాన్‌కు ఇచ్చానని ఆ పోస్టులో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

