లక్ష్యానికి దూరంగా గ్రామీణ భవనాలు!
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, మహిళా సాధికారత పేరిట కాంగ్రెస్ సర్కార్ చెప్తున్న గొప్పలకు, క్షేత్రస్థాయిలోని కఠిన వాస్తవాలకు నకకు నాకలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ పంచాయతీ, మహిళా సమాఖ్య, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. ఒకవైపు సర్కార్ నిర్దేశించుకున్న ప్రారంభోత్సవ ముహూర్తం దూసుకొస్తున్నప్పటికీ, పనులు మాత్రం ఎకడి గొంగడి అకడే అన్న చందంగా మారింది.
- మొత్తం 9,500 భవనాల్లో పూర్తయింది 650 మాత్రమే..
- నవంబర్ 19నాటికి భవనాలను ప్రారంభిస్తామన్న సర్కార్
- నెల రోజుల్లో పనులు పూర్తయ్యేనా?
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, మహిళా సాధికారత పేరిట కాంగ్రెస్ సర్కార్ చెప్తున్న గొప్పలకు, క్షేత్రస్థాయిలోని కఠిన వాస్తవాలకు నకకు నాకలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ పంచాయతీ, మహిళా సమాఖ్య, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. ఒకవైపు సర్కార్ నిర్దేశించుకున్న ప్రారంభోత్సవ ముహూర్తం దూసుకొస్తున్నప్పటికీ, పనులు మాత్రం ఎకడి గొంగడి అకడే అన్న చందంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,500 భవనాలను వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని సర్కార్ బాకాలు ఊదినప్పటికీ, ఇప్పటివరకు అధికారులు పూర్తి చేయగలిగింది 650 భవనాలు మాత్రమే. అంటే కనీసం 7 శాతం పనులు కూడా పూర్తికాకపోవడం ప్రభుత్వ పర్యవేక్షణ లోపానికి, నిధుల కొరతకు అద్దం పడుతున్నది. మిగతా వేలాది భవనాలు పునాదుల దశలోనే, లేదా సగం గోడలతో దర్శనమిస్తున్నాయి.
ప్రకటనల హోరు.. ఆచరణలో పూజ్యం!
మహిళల ఆర్థిక సాధికారత కోసం 8,000 గ్రామాల్లో రూ.800 కోట్లతో సమాఖ్య భవనాలు నిర్మిస్తున్నామని, 5,118 గ్రామ పంచాయతీలకు రూ.1,000 కోట్లతో సొంత భవనాలు కడుతున్నామని గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతకతోపాటు ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా మారింది. సొంత భవనాలు లేక వేలాది అంగన్వాడీ కేంద్రాలు రేకుల షెడ్లలో, అద్దె కొంపల్లో చిన్నారులకు, గర్భిణులకు రక్షణ లేని వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఇక సమాఖ్య భవనాల పరిస్థితి చెప్పనక్కరలేదు. మహిళా సంఘాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి నీడ లేక ఆరుబయట అవస్థలు పడుతున్నారు.
తమకు బిల్లులు చెల్లించకపోవడంతోనే పనులు నిలిచిపోయాయని కాంట్రాక్టర్లు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆర్థికశాఖ మంత్రి భట్టి చాంబర్ వద్ద వారు నిరసన కూడా చేపట్టారు. రాబోయే నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ భవనాలన్నింటినీ వైభవంగా ప్రారంభించాలని ప్రభుత్వం గడువు విధించుకున్నది. ఇంకా నెల రోజులు కూడా లేని ఈ సమయంలో, ఇంకా 8,800కు పైగా భవనాల నిర్మాణాలు పూర్తవుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనుల్లో వేగం పెంచకపోతే అనుకున్న తేదీకి ప్రారంభోత్సవాలు సాధ్యపడకపోవచ్చని క్షేత్రస్థాయిలో పనులను బట్టి తెలుస్తున్నది.
వివిధ రకాల భవనాలు : కేటాయింపుల వివరాలు
మొత్తం లక్ష్యంగా పెట్టుకున్న భవనాలు : 9,500
ఇప్పటివరకు పూర్తయినవి : 650 మాత్రమే (దాదాపు 93% పెండింగ్)
సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీలు : 5,118 జీపీలకు రూ.1,000 కోట్లు
మహిళా (సమాఖ్య) సంఘాల భవనాలు : 8 వేల గ్రామాలకు రూ. 800 కోట్లు
గడువు తేదీ (లక్ష్యం) : నవంబర్ 19, 2026 (ఇందిరాగాంధీ జయంతి)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

