మోదీ గో బ్యాక్.. సింగరేణిలో కార్మికుల నిరసనల హోరు
Singareni | ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన బాటపట్టారు.
పెద్దపల్లి: ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన బాటపట్టారు. మందమర్రి, బెల్లంపల్లి, భూపాలపల్లి, శ్రీరామ్‌పూర్, గోదావరిఖని, ఇల్లందు, కొత్తగూడెం, మణుగూరు ఏరియాల్లో కార్మికులు నిరసన వ్యక్తంచేశారు. నల్లబ్యాడ్జీలు ధరించడంతోపాటు నల్లజెండాలను ఎగురవేశారు. మోదీ గోబ్యాక్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

కాగా, ప్రధాని పర్యటన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. సింగరేణిలోని 5వ ఇంక్లైన్ వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును, రామగిరిలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

గోదావరిఖని 11వ గని వద్ద ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్యను ఇతర నాయకులను అరెస్టు చేశారు. తెలంగాణ రైతు సంఘం అధ్యక్షురాలు పస్య పద్మను హౌస్ అరెస్ట్ చేశారు. జీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అరెస్టుకు నిరసనగా కార్మికులు నిరసన వ్యక్తంచేశారు. కాగా, ప్రధాని పర్యటకు వ్యతిరేకంగా వామపక్షాలు నేడు రామగుండం బంద్‌నకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
Aurangzeb Tomb | ఔరంగజేబు సమాధి తొలగింపునకు డెడ్‌లైన్ ఫిక్స్.. సంచలన ప్రకటన చేసిన మహారాష్ట్ర మంత్రి!
Panchayat Raj | ఆరు నెలలకో అధికారి.. పీఆర్ఆర్డీలో మూడేండ్లలో ఆరుగురు స్పెషల్ సీఎస్ల బదిలీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

