ఎస్ఐ ప్రిలిమ్స్ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు గడువు ఆగస్టు 15
హైదరాబాద్ : ఈ నెల 7వ తేదీన నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ కీ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ స్టేల్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాస్ రావు ప్రకటన చేశారు. ఎస్ఐ ప్రిలిమ్స్ ప్రాథమిక కీ కోసం www.tslprb.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. ప్రాథమిక కీపై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 15న సాయంత్రం 5 గంటలకు వరకు బోర్డుకు తెలియజేయాలని సూచించారు.
అభ్యంతరం ఉన్న ఒక్కో ప్రశ్నకు వేర్వేరుగా వెబ్సైట్లో సూచించిన విధానంలోని టెంప్లేట్స్ ఫార్మెట్లో ఆన్లైన్లోనే పంపాలని సూచించారు. తమ అభ్యంతరాన్ని ధ్రువీకరించేందుకు సరైన పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను పీడీఎఫ్ లేదా జేపీఈజీ ఫార్మెట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. అసంపూర్తి సమచారంతో పంపే అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోబడవని పేర్కొన్నారు. అదే విధంగా మ్యానువల్‌గా పంపే అభ్యంతరాలను సైతం పరిగణనలోకి తీసుకోబడదని, కేవలం ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలని పేర్కొన్నారు. కాగా, వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 554 ఎస్సై పోస్టులకుగాను రాష్ట్రవ్యాప్తంగా 2,25,759 మంది అభ్యర్థులు ఈ నెల 7న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు హాజరైన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

