స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష : మంత్రి అల్లోల
మంత్రి అల్లోల | మరోసారి విరుచుకు పడుతున్న కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలని, స్వీయ జాగ్రత్తలే ఇందుకు శ్రీరామ రక్ష అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ : మరోసారి విరుచుకు పడుతున్న కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలని, స్వీయ జాగ్రత్తలే ఇందుకు శ్రీరామ రక్ష అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తాజా పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. కొవిడ్ జాగ్రత్తలు పాటించటంపై అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ప్రాణం విలువైనదని, ఎలాంటి అజాగ్రత్తలకు చోటివ్వకుండా కరోనా నియమాలను పాటించాలన్నారు. ప్రతి పౌరుడు, ఉద్యోగులు ప్రభుత్వ సూచనలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని మంత్రి చెప్పారు. మంత్రి సూచనల మేరకు అరణ్య భవన్ లో ప్రత్యేకంగా కొవిడ్ వాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించినట్లు పీసీసీఎఫ్ వెల్లడించారు.
ప్రతి ఉద్యోగి వాక్సిన్ వేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖతో సమస్వయం ద్వారా అన్ని జిల్లాల్లో క్షేత్ర స్థాయి సిబ్బందికి వ్యాక్సిన్ ఇప్పిస్తున్నామని పీసీసీఎఫ్ వెల్లడించారు.
అరణ్య భవన్ లో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సెంటర్ లో శోభ స్వయంగా దగ్గర ఉండి, ఉద్యోగులు అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించారు. హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎం.జె. అక్బర్, డీఎఫ్ఓ జోజి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఇవి కూడా చదవండి..
నేల తల్లి బాగుంటేనే భవిష్యత్తు : మంత్రి ఐకే రెడ్డి
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఒకే దేశంలో వ్యాక్సిన్‌కు రెండు ధరలా?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

