7 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
రాజస్థాన్ కేంద్రంగా హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా నడుపుతున్న నలుగురు సభ్యుల ముఠాను మాదాపూర్ పోలీసులతో కలిసి సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు.
- రాజస్థాన్ కేంద్రంగా హైదరాబాద్‌కు సరఫరా
- నలుగురు నిందితుల అరెస్టు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాజస్థాన్ కేంద్రంగా హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా నడుపుతున్న నలుగురు సభ్యుల ముఠాను మాదాపూర్ పోలీసులతో కలిసి సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద రూ.7 కోట్ల విలువ చేసే ఒక కిలో స్వచ్ఛమైన హెరాయిన్, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనరేట్‌లో మీడియాతో వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన సంతోష్ ఆచార్య విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి పలు ప్రాంతాలకు సరఫరా చేస్తాడు.
అతడి వద్ద నేమిచంద్ భాటి, నర్పట్‌సింగ్ డ్రగ్స్ కొనుగోలు చేసి అజయ్భాటి, హరీశ్ సిర్వితో వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తారు. ఈ క్రమంలో రెండున్నర నెలల కిందట నేమిచంద్ హైదరాబాద్‌కు వచ్చి తన బావమరిది అయిన అజయ్భాటి, అతడి స్నేహితుడు హరీశ్ సిర్వితో హెరాయిన్ అమ్మకాల గురించి చర్చించాడు. వారిద్దరు ఓకే చెప్పటంతో డ్రగ్స్ కోసం రాజస్థాన్ వెళ్లాడు. తిరిగి హెరాయిన్‌ను చిన్న ప్యాకెట్లలో పౌడర్ రూపంలో ప్యాక్ చేసి నర్పట్సింగ్తో కలిసి ప్రైవేట్ బస్సులో నగరానికి చేరుకున్నాడు. అజయ్భాటి, హరీశ్ సిర్విని కలిసి డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నించగా.. అప్పటికే నిఘా పెట్టిన ఎస్వోటీ డీసీపీ డీ శ్రీనివాస్ తన బృందంతో వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు.
అయితే, ప్రధాన డ్రగ్స్ సరఫరాదారు అయిన సంతోష్ ఆచార్య ఇప్పటికే డ్రగ్స్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నా.. తన అనుచరుల ద్వారా విక్రయాలు చేపడుతున్నాడని సీపీ మహంతి తెలిపారు. పట్టుబడిన హెరాయిన్ స్వచ్ఛమైనదని, ఇది ఒక గ్రాము రూ.7 వేలకు పైగా ఉంటుందని వెల్లడించారు. నిందితులు నగరంలో ఎవరికి విక్రయించారన్నదానిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. సంతోష్ ఆచార్యను అదుపులోకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు. కేసు ఛేదించిన శంషాబాద్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సంజయ్‌కుమార్ బృందం, మాదాపూర్ పోలీసులను సీపీ అభినందించారు. అటు.. డీజీపీ జితేందర్ కూడా పోలీస్ బృందాన్ని అభినందించారు. డ్రగ్స్‌ను అరికట్టడంలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పోలీసులకు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

