హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ‘గ్లోబల్ గ్రీన్ ఐకాన్’ పురస్కారాన్ని అందుకోవడానికి లండన్ వెళ్లిన గ్రీన్ ఇండి యా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌కు ఎన్నారై బీఆర్ఎస్ యూకే శాఖ అధ్యక్షుడు నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో సభ్యు లు ఘన స్వాగతం పలికారు. పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషికిగాను సంతోష్‌కుమార్ ఈ పురస్కారానికి ఎంపికైన విషయం తెలిసిందే.
స్వాగత కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు అనిల్ కుర్మాచలం, గ్రీన్ఇండియా కోఫౌండర్ రాఘవేంద్ర యాదవ్, ఉపాధ్యక్షుడు హరిగౌడ్ నవాబుపేట్, సత్యమూర్తి చిలుముల, అశోక్‌గౌడ్ దూసరి, రవి ప్రదీప్ పులుసు, పవన్‌కుమార్ గౌడ్, తరుణ్ లునావత్, అమరేశ్వరి బోయిని, సాయికిరణ్రావు పేరాల, సాకేత్, సుప్రజ, సుమంత్, సంకీర్త్‌రెడ్డి, శివచరణ్ పాల్గొన్నారు.