హైదరాబాద్ సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): టీహబ్‌లోని స్టార్టప్‌ల కోసం నిర్వహిస్తున్న రూబ్రిక్స్ కార్యక్రమం ముగింపు సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు.
ప్రారంభ దశ నుంచి కనీస ఆచరణీయ ఉత్పత్తిని రూపొందించే దశకు చేరిన స్టార్టప్‌లకు అవసరమైన నిధులు సమకూర్చడం, మార్కెటింగ్, విస్తరణ కోసం మద్దతు ఇచ్చేందుకు 100కు పైగా స్టార్టప్‌లను ఎంపిక చేయనున్నట్టు టీహబ్ నిర్వాహకులు తెలిపారు.