RS Praveen kumar | మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచన
RS Praveen kumar | ఓ దళిత వ్యక్తి తన కుటుంబంతో కలిసి దర్శనం చేసుకునేందుకు ఆలయంలోకి వెళ్లే క్రమంలో వారిని అడ్డుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి మేనమామ వెంకటరాంరెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
RS Praveen kumar | కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి మేనమామ వెంకటరాంరెడ్డి దళిత కుటుంబాన్ని గుడిలోకి రాకుండా అడ్డుకున్నాడని తెలిసిందే. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఓ దళిత వ్యక్తి తన కుటుంబంతో కలిసి దర్శనం చేసుకునేందుకు ఆలయంలోకి వెళ్లే క్రమంలో వారిని అడ్డుకున్న వెంకటరాంరెడ్డి ఈ గుడి మేము కట్టించాం.. మీరు ఎలా వస్తారంటూ అతనితో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
‘మేం కట్టుకున్న గుడి లోపలికి మీరు ఎట్ల వస్తరు’ అని వనపర్తి జిల్లా మంగంపల్లిలో ఎస్సీ మాదిగ యువకుడిని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి మేన మామ.. ఆ భూమి ప్రైవేటు ల్యాండ్ అయితే పర్మిషన్ లేకుండా పోవడం బహుశా నేరమే. కానీ ఇది గ్రామ పంచాయితీ భూమిలో కట్టిన గుడి. అట్లాంటప్పుడు దేవాలయ ప్రవేశం నేరం ఎట్లయితది.. ? ఎమ్మెల్యే గారు ఇది వివక్ష కాదా..? అని ప్రశ్నించారు. ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా మీరే పెద్దమందడి పోలీస్ స్టేషన్‌పై వెళ్లి మీ మేనమామపై కేసు పెట్టాలి. అరెస్ట్ చేయించాలి. లేకపోతే ఎస్సీ బస్తీలలో మీరు అడుగుపెట్టలేరని హెచ్చరించారు.
ఇప్పుడు కాంగ్రెస్ మేఘారెడ్డి ఇంటి దగ్గర డప్పులు కొడతారా వేముల వీరేశం, దేవని సతీష్ గారు..? ఇప్పుడు అర్థం అయ్యిందా బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని ఎందుకు దగ్ధం చేశారో..?రేవంత్ రెడ్డి హోమ్ మంత్రి మీరే కదా, పోలీసులకు ఆదేశాలు ఇవ్వండి. స్పీకర్ మీద దళిత xదళిత x దళిత అంటూ వల్లమాలిన ప్రేమ చూపించారు కదా..? ఇప్పుడు చూపించండి. అయినా బస్తీలల్ల గ్రామ దేవతలు ఎల్లమ్మ, మైసమ్మ, మారెమ్మ, సవారమ్న, పెద్దమ్మ, పోచమ్మ, సమ్మక్క, అరుంధతి అమ్మ లాంటి ఎందరో ప్రేమించే తల్లులుండగా, బాబాసాహెబ్ , కాన్షీరాం, జాంబవంతుడి లాంటి తండ్రులుండగా మనం ఎందుకు ఇన్ని అవమానాలు భరించి ఈ ‘పెద్ద’ దేవుళ్ల దగ్గర ‘పిలవని పేరంటాలకు’ పోవాలె, మాల – మాదిగ భయ్యాలు..? మీ సంకలల్ల ఉన్న పిల్లలకు ఈ వివక్ష అర్థం అయితే వారు పెద్దగయిన తరువాత ఈ అవమానాన్ని నిజంగా భరిస్తరా..? ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నవాడు, తెలిసి తెలిసీ ఇట్లాంటి అవమానాలు భరించడు. ఇకనైనా మారండి.. అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హితవు పలికారు.
దళితులను గుడిలోకి రాకుండా అడ్డుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో కుటుంబంతో కలిసి ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకోకుండా ఓ వ్యక్తిని అడ్డుకున్న వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి మేనమామ వెంకటరాంరెడ్డి
ఈ గుడి మేము కట్టించాం.. మీరు ఎలా వస్తారంటూ దౌర్జన్యం
ఈ కాలంలో కూడా దళితులపై వివక్ష ఎందుకంటూ బాధితుడి ఆవేదన
— Telugu Scribe (@TeluguScribe) October 13, 2026
Read Also :
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచన
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

