కోరుట్లలో ఎస్బీఐ ఏటీఎం చోరీ.. 19 లక్షలు స్వాధీనం, పరారైన దుండగులు
Korutla | జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దుండగులు సినీఫక్కీలో ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని వేములవాడ రోడ్డులో ఉన్న ఏటీఎంలో నలుగురు వ్యక్తులు శనివారం రాత్రి నగదు ఎత్తుకెళ్లారు
జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దుండగులు సినీఫక్కీలో ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని వేములవాడ రోడ్డులో ఉన్న ఏటీఎంలో నలుగురు వ్యక్తులు శనివారం రాత్రి నగదు ఎత్తుకెళ్లారు. ఏటీఎం నుంచి డబ్బులు తీస్తుండగా అందులో ఉన్న అల్లారం మోగింది. దీంతో అప్రమత్తమైన పెట్రోలింగ్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే డబ్బును పెట్టెల్లో పెట్టుకున్న దొంగలు.. కారులో ఎక్కుతుండగా పెట్రోలింగ్ వాహనం అక్కడికి చేరుకున్నది.
గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నుంచి డబ్బుల బాక్స్ రోడ్డుపై పడిపోయింది. ఎదురుగా వస్తున్న వాహనం దానిని గుద్దేయడంతో అందులో ఉన్న డబ్బు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. సుమారు రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు దొంగలను పట్టుకోవడానికి యత్నించినప్పటికీ చిక్కకుండా పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

