డమ్మీ తుపాకీతో బెదిరించి చోరీ
ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి ఇంట్లో చొరబడి, డమ్మీ తుపాకీతో బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు లాక్కెళ్లారు దుండగులు.
- వృద్ధురాలి మెడలో ఆభరణాలు దోచుకెళ్లిన దుండగులు
శాలిగౌరారం, అక్టోబర్ 4: ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి ఇంట్లో చొరబడి, డమ్మీ తుపాకీతో బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు లాక్కెళ్లారు దుండగులు. ఈ ఘటన సోమవారం రాత్రి నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం రామానుజపురంలో జరిగింది. సోమవారం గ్రామస్థులు సద్దుల బతుకమ్మ ఆడుకుంటుండగా, ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వచ్చారు. ఇండ్లల్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్న ఎర్ర జానమ్మ అనే వృద్ధురాలి ఇంట్లో చొరబడ్డారు.
అప్పటికే బతుకమ్మ ఆడి ఇంటికి రాగానే, ఇంటి తలుపులు తెరిచి కనిపించాయి. వెంటనే లోపలికి వెళ్లి చూడగా, దొంగలు కన్పించారు. దొంగలు డమ్మీ తుపాకీ చూపించి జానమ్మ మెడలో ఉన్న పుస్తెల తాడు, చెవి కమ్మలు లాక్కెళ్లారు. తుపాకీని అక్కడే వదిలి వెళ్లారు. రూ.50 వేల నగదుతోపాటు 3 తులాల చంద్రహారం, 20 తులాల వెండి మొలతాడు కూడా తీసుకెళ్లినట్టు బాధితురాలు తెలిపింది. జానమ్మ కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీఐ రాఘవరావు మంగళవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

