చెయ్యికి చేటు తెచ్చిన ఆర్ఎంపీ వైద్యం
ఆర్ఎంపీ చేసిన వచ్చిరాని వైద్యంతో ఓ వృద్ధురాలి చెయ్యిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన గందేపల్లి ఉప్పలమ్మకు నిరుడు పక్షవాతం రావడంతో కుడి చెయ్యి పని చేయకుండా పోయింది.
- పక్షవాతంతో పనిచేయని కుడి చెయ్యి..
- వైద్యం వికటించడంతో దెబ్బతిన్న ఎడమ చెయ్యి
ఐనవోలు, జూన్ 8 : ఆర్ఎంపీ చేసిన వచ్చిరాని వైద్యంతో ఓ వృద్ధురాలి చెయ్యిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన గందేపల్లి ఉప్పలమ్మకు నిరుడు పక్షవాతం రావడంతో కుడి చెయ్యి పని చేయకుండా పోయింది. గత నెల 30న ఉప్పలమ్మకు వాంతులు కాగా, 31న ఆర్ఎంపీతో వైద్యం చేయించారు. నీరసంగా ఉండటంతో ఆమెకు ఇంటి దగ్గరే ఎడమ చెయ్యికి స్లైన్ పెట్టాడు. రెండో రోజు చెయ్యి కొంచెం నల్లబడిందని కుటుంబ సభ్యులు ఆర్ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, మళ్లీ రెండు ఇంజెక్షన్లు వేశాడు. సమస్య తీవ్రం కాగా ఈ నెల 5న వరంగల్‌లోని దవాఖానకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు నిమ్స్‌కు రెఫర్ చేయడంతో ఈ నెల 6న తీసుకెళ్లగా, పరీక్షించిన వైద్యులు చేతిని తొలగించాల్సి వస్తుందని చెప్పారు. గాంధీ, ఉస్మానియా లేదా వరంగల్ ఎంజీఎంలో చేర్పించాలని సూచించారు. దీంతో గురువారం ఎంజీఎం దవాఖానలో చేర్పించారు. శుక్రవారం ఉదయం ఉప్పలమ్మను పరీక్షించిన వైద్యులు చేతిని తొలగించాలని సూచించారు. గతంలో పక్షవాతం కారణంగా కుడి చేయి పనిచేయకుండా పోగా.. ఇప్పుడు ఆర్ఎంపీ వైద్యం వికటించి ఎడమ చేతిని కోల్పోవాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు వాపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

