కాజేసిన రూ. 85 లక్షలు కాపాడారు!
డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధుడి నుంచి మోసగాళ్లు కొట్టేసిన రూ. 85.2 లక్షలు రికవరీ చేశామని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) డైరెక్టర్ శిఖాగోయెల్ తెలిపారు. హైదరాబాద్‌లోని మలాజిగిరి కమిషనరేట్, నేరెడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన 85 ఏండ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగికి ఆగస్టు 21న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారిగా నటిస్తూ ఒక వ్యక్తి యూనిఫామ్‌లో వీడియో కాల్ చేశాడు.
- డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ ఉద్యోగికి టోకరా
- నిందితుడి ఖాతా ఫ్రీజ్ చేయించిన పోలీసులు
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధుడి నుంచి మోసగాళ్లు కొట్టేసిన రూ. 85.2 లక్షలు రికవరీ చేశామని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) డైరెక్టర్ శిఖాగోయెల్ తెలిపారు. హైదరాబాద్‌లోని మలాజిగిరి కమిషనరేట్, నేరెడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన 85 ఏండ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగికి ఆగస్టు 21న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారిగా నటిస్తూ ఒక వ్యక్తి యూనిఫామ్‌లో వీడియో కాల్ చేశాడు. బాధితుడి ఆధార్ వివరాలు దుర్వినియోగం అయ్యాయని బెదిరించాడు. రూ. 2.5 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగాయని, కేసు నుంచి బయటపడాలంటే ఆర్బీఐ వెరిఫికేషన్ పేరుతో డబ్బులు పంపాలని నమ్మించాడు.
భయపడిన బాధితుడు నిందితుడు చెప్పిన ఖాతాలోకి రూ. 85,20,000 బదిలీ చేశాడు. కేటుగాడు మరో రూ.42 లక్షలు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే బ్యాంక్‌ను సంప్రదించి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్(ఎన్సీఆర్పీ) ద్వారా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందడమే తడవుగా టీజీసీఎస్బీ అధికారులు లావాదేవీలను ట్రాక్ చేశారు. కోయంబత్తూరులోని ఐడీఎఫ్సీ బ్యాంక్ శాఖలోని నిందితుడి ఖాతాను సకాలంలో ఫ్రీజ్ చేశారు. బాధితుడు కోల్పోయిన మొత్తం రూ. 85.2 లక్షలను సురక్షితంగా రక్షించగలిగారు. ఈ సందర్భంగా టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయెల్ మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వ లేదా పోలీసు సంస్థలు, ఆర్బీఐ అధికారులు డబ్బులు బదిలీ చేయమని అడుగరని స్పష్టం చేశారు. అలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే భయపడకుండా వెంటనే 1930 నంబర్‌కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

