కంటి మార్గం ద్వారా మెదడు కణితి తొలగింపు.. నిమ్స్ వైద్యుల అద్భుత ఘనత
నిమ్స్ దవాఖాన వైద్యులు మరో అద్భుత ఘనత సాధించారు. అత్యంత క్లిష్టమైన నూర్యోసర్జరీని ఆధునిక పద్ధతిలో విజయవంతంగా నిర్వహించారు. కంటి గవ్వ మార్గం ద్వారా మెదడులోని కణితిని పూర్తిగా తొలగించి వైద్యరంగంలో సరికొత్త మైలురాయిని అధిగమించారు.
ఖైరతాబాద్, జూన్ 6: నిమ్స్ దవాఖాన వైద్యులు మరో అద్భుత ఘనత సాధించారు. అత్యంత క్లిష్టమైన నూర్యోసర్జరీని ఆధునిక పద్ధతిలో విజయవంతంగా నిర్వహించారు. కంటి గవ్వ మార్గం ద్వారా మెదడులోని కణితిని పూర్తిగా తొలగించి వైద్యరంగంలో సరికొత్త మైలురాయిని అధిగమించారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా చిన్న శంకరపేట మండలం మధుర్ గ్రామానికి చెందిన మంగలి లత (50) తీవ్రమైన తలనొప్పితో నిమ్స్‌ను ఆశ్రయించారు. దీంతో ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించడంతో కంటి వెనుకభాగాన పుర్రె అడుగు ప్రాంతంలోని మెదడులో కణితి ఉన్నట్టు తేలింది.
సాధారణంగా ఇలాంటి కణతుల తొలగింపునకు తల ఎముకను తెరిచి క్రానియోటమీ శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, లతకు స్వల్ప గాయంతో చికిత్స అందించాలన్న లక్ష్యంతో నిమ్స్ వైద్య బృందం ఆధునిక ఎండోస్కోపిక్ ట్రాన్స్ ఆర్బిటల్ అప్రోచ్ విధానాన్ని ఎంచుకున్నది.
ఎంతో అరుదైన విధానంలో భాగంగా నిమ్స్ న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ వై వంశీకృష్ణ నేతృత్వంలో డాక్టర్ యర్రగుంట తిరుమల్, డాక్టర్ రామ్‌నాథ్‌రెడ్డి, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ ఉమామహేశ్వర్ బృందం అత్యాధునిక 3డీ న్యూరోనావిగేషన్ వ్యవస్థతోపాటు కావిట్రాన్ అల్ట్రాసోనిక్ సర్జికల్ ఆస్పిరేటర్ సాంతికేతికను వినియోగించి ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. కనుబొమ్మ మడత వద్ద చిన్న కోత చేయడం ద్వారా హైడెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో మిల్లీమీటర్ స్థాయి కచ్చితత్వంతో కణితిని పూర్తిగా తీసేశారు.
ఉచితంగా రూ.15 లక్షల చికిత్స
ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం కింద నిమ్స్‌లో పూర్తి ఉచితంగా నిర్వహించినట్టు నిమ్స్ వైద్యులు తెలిపారు. లతకు అRemoval రుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

