కేసీఆర్ పాలనలో గడిచిన ఎనిమిదేండ్లలో హైదరాబాద్ గణనీయమైన ప్రగతి సాధించింది. విద్య, వైద్యం, ఆతిథ్యం, సాంకేతికత తదితర రంగాలకు కూడలిగా మారింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ) : ఏటా లక్షలాది మందికి కొత్తగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. అందుకే భాగ్యనగరంలో సొంతింటి కోసం పక్కరాష్ర్టాల వారు కూడా మొగ్గుచూపుతున్నారు. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే, హైదరాబాద్లోనే భూముల విలువ ఎక్కువగా ఉంటున్నట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ రీసెర్చ్ కంపెనీ ‘లైసాసెస్ ఫోరస్’ తాజా నివేదికలో వెల్లడించింది.