Cherlapally Terminal | ఈ నెల 28న చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం..
Cherlapally Terminal | చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ఈ నెల 28న ఆవిష్కరించనున్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పాటు మరో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో రైల్వేశాఖ అభివృద్ధి చేసింది.
Cherlapally Terminal | చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ఈ నెల 28న ఆవిష్కరించనున్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పాటు మరో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో రైల్వేశాఖ అభివృద్ధి చేసింది. ఈ స్టేషన్లో ఆరు ఎస్కలేటర్లు, ఏడు లిఫ్ట్‌లు, ఆరు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు వెయిటింగ్ హాల్స్, హైక్లాస్ వెయిటింగ్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్లో ఎగ్జిక్యూటివ్ లాంజ్‌ని నిర్మించారు. టెర్మినల్ తొలి అంతస్తులో కెఫ్ టేరియా, రెస్టారెంట్, రెస్ట్ రూమ్ తదితర సౌకర్యాలను కల్పించారు. ప్రయాణికులకు ఉచిత వైఫై సదుపాయం అందుబాటులో ఉంటుంది.
సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గిచేందుకు చర్లపల్లి టెర్మినల్‌ను రైల్వేశాఖ అభివృద్ధి చేసింది. చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. దాదాపు 25 ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇక్కడి నుంచే నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. ఇందులో పలు రైళ్లకు సంబంధించి అనుమతి ఇచ్చింది. ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు గూడ్స్ రైళ్లు సైతం ఇక్కడే అన్లోడ్ చేసుకునే వీలుంటుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

