రేవంత్, పొంగులేటి దోపిడీ దొంగలు!
రాష్ట్ర సంపదను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోడీ దోచుకుతింటున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు.
- వాళ్లిద్దరూ రాజీనామా చేయాలి
- రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై చర్యలు తీసుకున్న హైడ్రా.. భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్‌పై ఎందుకు తీసుకోలే?
- రాష్ర్టానికి ప్రతి నెలా 20 లక్షలు గండి
- బీఆర్ఎస్ వచ్చాక ట్రిబ్యునల్ వేస్తం
- బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరిక
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సంపదను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోడీ దోచుకుతింటున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. అధికారం అడ్డంపెట్టుకొని రాష్ట్ర సంపదను దోచుకుంటున్న రేవంత్‌రెడ్డి, పొంగులేటి తమ పదవుల కు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆలస్యంగానైనా కొత్వాల్‌గూడలో అక్రమ క్రషర్లపై చర్యలు చేపట్టిన హైడ్రా.. భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
రాఘవ కన్స్ట్రక్ష న్స్ అలియాస్ తిరుమల కన్‌స్ట్రక్షన్స్‌పై చర్యలు తీసుకున్న హైడ్రాకు, అంతకంటే మూడింతలు పెద్దదైన భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ కంపెనీ ఎందుకు కనపడటం లేదని నిలదీశారు. తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోకాపేటలో 17 ఎకరాల్లో మైనింగ్ చేస్తున్న భాగ్యలక్ష్మి కంపెనీకి ఎలాంటి అనుమతులు, సేల్‌డీడ్, లీజ్డీడ్ లేకపోయినా ఎలా విద్యుత్తు కనెక్షన్ ఇచ్చారని ప్రశ్నించారు. ఒకవేళ టెంపరరీ కోటా కింద విద్యుత్తు సరఫరాకు అనుమతి ఇస్తే, క్యాటగిరీ-8 కింద ఇవ్వాలని చెప్పారు. కానీ, భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిదిది కాబట్టి క్యాటగిరీ-2 కింద ఇండస్ట్రియల్ కంపెనీ పేరు మీద అనుమతి ఇచ్చారని మండిపడ్డారు. దీంతో ప్రభుత్వానికి ప్రతినెలా రూ.20 లక్షల ఆదాయానికి గండిపడిందని విమర్శించారు. వెంటనే అధికారులు విద్యుత్తు సరఫరా నిలిపివేసి, కనెక్షన్ కట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశపై వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్రిబ్యునల్ వేస్తామని హెచ్చరించారు.
కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులు ఏం చేస్తున్నట్టు?
కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీ షాపులో పట్టపగలు తుపాకులతో బెదిరించి కాల్పులు జరిపి దోపిడీ చేస్తే హోంశాఖ మంత్రి ఇప్పటికీ అకడికి వెళ్లలేదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. దేశం కోసం, ధర్మం కోసం రోజు మాట్లాడే బండి సంజయ్ ఆఫీస్ పకనే ఈ దోపిడీ జరిగినా ఆయన ఎందుకు సందర్శించలేదని నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టారని, పోలీసులు నిరంతరం రోడ్ల మీద ఉండి, నిఘా ఉంచేవారని పేర్కొన్నారు. కానీ, రేవంత్‌రెడ్డి పాలనలో పోలీసులు బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టడం, నాయకుల ఇండ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ అక్రమాలను ప్రశ్నిస్తే, స్కామ్‌లను బ యటపెడితే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

