KTR | నిరుద్యోగ యువతకు నాణ్యమైన స్టడీ మెటీరియల్ ఎంతో అవసరం : కేటీఆర్
KTR | పోటీ పరీక్షల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన కరెంట్ అఫైర్స్ మెటీరియల్ విద్యార్థుల ప్రిపరేషన్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | వివిధ ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచే లక్ష్యంతో రూపొందించిన కరెంట్ అఫైర్స్ స్టడీ మెటీరియల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు నాణ్యమైన స్టడీ మెటీరియల్ అందించడం ఎంతో అవసరమన్నారు. పోటీ పరీక్షల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ విద్యార్థుల ప్రిపరేషన్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉద్యోగార్థులకు కేవలం మాటలతో భరోసా ఇవ్వడమే కాకుండా, వారి లక్ష్య సాధనకు అవసరమైన విద్యా వనరులను అందించే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్ రెడ్డిని కేటీఆర్ అభినందించారు. నిరుద్యోగ యువత కష్టానికి తగిన ఫలితం దక్కాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం సాధించి తమ కుటుంబాల ఆశయాలను నెరవేర్చుకోవాలని ఆకాంక్షించారు. యువత విజయం మన లక్ష్యం… వారి భవిష్యత్తుకు అండగా నిలవడం మన బాధ్యత అని కేటీఆర్ అన్నారు.

Read Also :
Miami Airport | మియామి ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. ఇద్దరికి గాయాలు..!
Tragedy | అనకాపల్లి జిల్లాలో విషాదం..నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు మృతి
Jagtial Hospital | పని చేయని ఎమర్జెన్సీ పరికరాలు.. జగిత్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మృతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుద్యోగ యువతకు నాణ్యమైన స్టడీ మెటీరియల్ ఎంతో అవసరం : కేటీఆర్
Punjab CM | రోడ్డు ప్రమాద మృతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన భగవంత్ మాన్..!
Woman murdered in trial room | బట్టల షాప్‌లోని ట్రయల్ రూమ్‌లో ఉద్యోగిని మృతదేహం.. ఆమెను హత్య చేసిన యువకుడు అరెస్ట్
Mahesh Bigala | దీక్షా దివాస్ వేడుకలకు సిద్ధం కావాలి.. బీఆర్ఎస్ ఎన్నారై శాఖలకు మహేష్ బిగాల పిలుపు
Cancer | భారత్‌లో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు.. ముందస్తుగా గుర్తించడం అవసరం అంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

