పీవీ అంత్యక్రియలు ఢిల్లీలో జరుపలేదెందుకు?
‘సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్' నేను ఇంకా చదవలేదు. కానీ తనకు పీవీతో ఎలాంటి విభేదాలు లేవని, ఆయనంటే ఎంతో గౌరవమని, తన అత్త, మాజీ ప్రధాని ఇందిర, భర్త రాజీవ్‌గాంధీకి అత్యంత ఆప్తుడని సోనియా ఆ పుస్తకంలో నిక్షిప్తం చేసినట్టు మీడియా ద్వారా విన్నాను. కానీ పార్టీకి, గాంధీ కుటుంబానికి సేవచేసిన, దేశ ప్రధానిగా పనిచేసిన పీవీ అంత్యక్రియలను న్యూఢిల్లీలో జరపలేదేందుకు? స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రధానికీ ఇలా జరగలేదు.
- ఇది ఆత్మీయుడికి ఇచ్చిన గౌరవమా? అవమానమా? పాఠకులే చెప్పాలి
- సోనియా ఆత్మకథపై పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ‘సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ నేను ఇంకా చదవలేదు. కానీ తనకు పీవీతో ఎలాంటి విభేదాలు లేవని, ఆయనంటే ఎంతో గౌరవమని, తన అత్త, మాజీ ప్రధాని ఇందిర, భర్త రాజీవ్‌గాంధీకి అత్యంత ఆప్తుడని సోనియా ఆ పుస్తకంలో నిక్షిప్తం చేసినట్టు మీడియా ద్వారా విన్నాను. కానీ పార్టీకి, గాంధీ కుటుంబానికి సేవచేసిన, దేశ ప్రధానిగా పనిచేసిన పీవీ అంత్యక్రియలను న్యూఢిల్లీలో జరపలేదేందుకు? స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రధానికీ ఇలా జరగలేదు. దీనిని గౌరవంగా భావించాలా? అవమానమని అనుకోవాలా? పాఠకులే చెప్పాలి’ అంటూ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. సోనియా ఆత్మకథ విడుదల నేపథ్యంలో వాణీదేవి బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో సంచలన వివరాలు వెల్లడించారు. నాడు పీవీకి జరిగిన అవమానాలు, అప్పటి పరిస్థితులను గుర్తుచేశారు.
పీవీ ఆర్థిక సంస్కరణలపై కనీస ప్రశంసేది?
పీవీ నర్సింహారావు మూడున్నర దశాబ్దాల కిందట తెచ్చిన విదేశాంగ విధానం.. పారిశ్రామిక, విద్య, ఆర్థిక రంగాల్లో సంస్కరణ ఫలాలను దేశప్రజలందరం అనుభవిస్తున్నామని వాణీదేవి నొక్కి చెప్పారు. ఇదే విషయాన్ని ప్రపంచమంతా కొనియాడుతున్నదని, నేడు ప్రపంచపటంలో భారత్ అగ్రగామిగా కొనసాగుతున్నదంటే నాటి పీవీ ఆర్థిక సంస్కరణలే కారణమనే విషయం అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. ఈ విషయం గురించి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏనాడూ మాట్లాడలేదని, ఒక ప్రశంస కూడా తాను ఎప్పుడూ వినలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
పీవీ శతజయంత్యుత్సవాలపై నిర్లక్ష్యం
పీవీ శతజయంతి తమ కుటుంబానికి చాలా ప్రత్యేకమైన విషయమని వాణీదేవి పేర్కొన్నారు. ఆయన అందించిన సేవలు పార్టీకి, దేశానికి కూడా ప్రత్యేకమేనని గుర్తుచేశారు. అంతటి మహావ్యక్తి పేరుతో పార్టీ పరంగా ఢిల్లీలో కానీ మరెకడైనా కానీ కనీసం ఒక స్మారకోపన్యాసం కూడా ఏర్పాటు చేయకపోవడంలోని ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఇదంతా ఒక ఎత్తయితే, ఆయనతో ఎలాంటి సంబంధం లేని, ఎలాంటి సేవలూ చేయని ఇతర పార్టీలు ఆయన గొప్పతనాన్ని గుర్తించి వేనోళ్ల పొగిడిన విషయాన్ని ప్రస్తావించారు.
‘భారతీయ జనతా పార్టీ ఆయనకు భారతరత్న ఇచ్చిందని.. అంతకంటే ముందు, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, కేసీఆర్ చొరవతో, 360 రోజుల పాటు ప్రతిరోజూ పీవీ స్మరణతోనే మొదలయ్యేలా శతజయంతి ఉత్సవాలను ప్రపంచం నలుమూలలా తెలిసేలా ఎంతో గొప్పగా నిర్వహించారు..’ అని కొనియాడారు. బీఆర్ఎస్.. పీవీ జీవించి ఉన్నప్పుడు ఉన్న పార్టీ కాదు, ఆ తర్వాత వచ్చిన పార్టీ. అయినా వారు ఆయనను వేనోళ్ల పొగడటమే కాకుండా, భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారని గుర్తుచేశారు. ఆయన గౌరవార్థం తనకు ఎమ్మెల్సీగా టికెట్ ఇవ్వడమే కాకుండా గెలిపించుకున్నారని కొనియాడారు. ఎవరు ఆయనను నిజంగా గౌరవిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని తేల్చిచెప్పారు.
పీవీని కావాలనే విస్మరించారు!
సోనియా గాంధీ రాసిన ఆత్మకథను ‘అబద్ధాల పుట్ట’గా పీవీ మనుమడు ఎన్వీ సుభాష్ అభివర్ణించారు.తిరువనంతపురంలో ఆయన పీటీఐతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి పీవీ అందించిన సహకారాన్ని సోనియా గాంధీ ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని విమర్శించారు.
తెలంగాణ ప్రస్తావన ఏదీ?: మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజకీయ నిర్ణయాల్లో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ అగ్రనేత, అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తన ఆత్మకథలో తెలంగాణ అంశాన్ని కనీసం ప్రస్తావించకపోవడం తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించిందని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ బుధవారం ఎక్స్ వేదికగా పేరొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే అపూర్వ చారిత్రాత్మక ఘట్టం గురించి సోనియా తన పుస్తకంలో ఒక మాట కూడా లేకపోవడం గమనార్హమని పేర్కొన్నారు. దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చిన కీలక ఘట్టాన్ని విస్మరించడమే కాకుండా, కనీసం ‘తెలంగాణ’ అనే పదాన్ని సైతం పుస్తకంలో ఎకడా ప్రస్తావించకపోవడం విస్మయానికి గురిచేస్తున్నదని తెలిపారు. ఎంతో విశిష్టమైన ప్రజా ఉద్యమ ఫలితాన్ని తన స్వీయ చరిత్రలో ఎందుకు చేర్చలేదో ఆమెకే తెలియాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

