President Murmu | డిసెంబర్ 21న అగ్రి వర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి రాక : ఉప కులపతి అల్దాస్ జానయ్య
President Murmu | తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో డిసెంబర్ 21న నిర్వహించనున్న స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని ఉప కులపతి అల్దాస్ జానయ్య తెలిపారు.
హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ( Agri-University) లో డిసెంబర్ 21న నిర్వహించనున్న స్నాతకోత్సవానికి( Convocation) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( President Murmu ) ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని యూనివర్సిటీ ఉప కులపతి అల్దాస్ జానయ్య ( Vice-Chancellor Janaiah ) తెలిపారు.
రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయం కులపతి శివ్ ప్రతాప్ శుక్లా అధ్యక్షతన జరిగే స్నాతకోత్సం లో 2025-26 విద్యా సంవత్సరం లో పీహెచ్డీ పూర్తి చేసిన 40 మంది విద్యార్థులకు , పీజీ పూర్తి చేసిన 100 విద్యార్థులకు , యూజీ పూర్తి చేసిన 1000 మంది విద్యార్థులకి రాష్ట్రపతి చేతుల మీదుగా పట్టాలు అందచేయనున్నట్లు వెల్లడించారు.అదే విధంగా అత్యంత ప్రతిభ కనపర్చిన 17 మంది విద్యార్థులకు బంగారు పతకాలు ప్రధానం చేయనున్నట్లు వివరించారు.

సుమారు 55 ఏళ్ల తర్వాత రాష్ట్రపతి విశ్వ విద్యాలయ స్నాతకోత్సవానికి హాజరు కావడం విశ్వ విద్యాలయం సిబ్బంది, విద్యార్థులకు గర్వ కారణం పేర్కొన్నారు. ఈ స్నాతకోత్సవంలో వై.ఎస్.ఆర్- కేవీపీ ఫౌండేషన్ తరపున దేశంలోని విశ్వ విద్యాలయాల చరిత్ర లోనే అతి విలువైన లక్ష రూపాయల నగదు బహుమతి, బంగారు పతకాన్ని అసాధారణ ప్రతిభ కనపర్చిన విద్యార్ధికి తొలిసారి అందచేయనున్నట్లు జానయ్య వివరించారు.
ఈ సందర్భంగా ప్రముఖ అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్త , భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ICAR) ప్రస్తుత డైరక్టర్ జనరల్ డాక్టర్ మంగీలాల్ జాట్‌కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయనున్నట్లు అల్దాస్ జానయ్య ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Banana Leaf | అరటి ఆకుల్లో భోజనం చేస్తే ఏమవుతుంది..? జీర్ణకోశ నిపుణులు ఏమంటున్నారు..?
Health tips | ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే ఈ పంపరపనస పండును మీరు ఎప్పుడైనా తిన్నారా..?
ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు : ఎస్పీ అక్షాన్ష్ యాదవ్
భద్రాద్రి డీపీఆర్‌ఓపై విచారణకు ఆదేశం
Breaking News | ప్రభుత్వానికి షాక్..మూసాపేట, నియోపోలీస్ భూముల వేలం రద్దు
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

