Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Dasoju Shravan Kumar | అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఒక రుషివలే తపస్సు చేసినట్టుగా అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి కనురెప్పపాటు కూడా కరెంట్ పోకుండా దేశమంఆ నివ్వెరపోయేలా కరెంట్ అందించిన ఘనత కేసీఆర్‌ది.. బీఆర్ఎస్ పార్టీదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు.
Dasoju Shravan Kumar | తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా సందర్భాల్లో ఇందిరాపార్క్ దగ్గర జరిగిన ధర్నాలు, సమ్మెలు చూసిన.. కరెంట్ కోతలకు వ్యతిరేకంగా రైతులు కానీయండి..పవర్ హాలీడేస్ డిక్లేర్ చేయాల్సిన అగత్యం వచ్చి పరిశ్రమల కానీ ధర్నాలు చేసిన సంఘటనలు చూసినమని అన్నారు. దానికి కొనసాగింపుగా అన్నట్టుగా పరాకాష్టగా ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కర్ర పట్టుకొని తెలంగాణ ఏర్పడితే కరెంట్ కష్టాలుంటాయి.
తెలంగాణ అంధకారంలో మునిగిపోతదని పత్రికా సమావేశాలు పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని ఒకసారి తెలంగాణ సమాజానికి గుర్తు చేస్తూనే తదనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఒక రుషివలే తపస్సు చేసినట్టుగా అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి కనురెప్పపాటు కూడా కరెంట్ పోకుండా దేశమంఆ నివ్వెరపోయేలా కరెంట్ అందించిన ఘనత కేసీఆర్‌ది.. బీఆర్ఎస్ పార్టీదని దాసోజు శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. కేవలం 7 వేల మెగావాట్ల ప్రతిపాదిత సామర్థ్యం ఉన్న కరెంట్ ఉత్పత్తిని 20 వేల మెగావాట్ల వరకు దాన్ని పరెగెత్తించి ప్రపంచమే ఔరా అని అబ్బురపోయే రీతిలో కేసీఆర్ రెవెల్యూషనైజ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ది స్ట్రేట్ ఆఫ్ తెలంగాణ దేశంలోనే అంత త్వరిత గతిలో కరెంట్ ఉత్పత్తికి తోడ్పడిన ప్రభుత్వం కానీ, నాయకుడు కానీ లేరు. అది కేసీఆర్‌కు మాత్రమే వర్తిస్తుందన్నారు.
కరెంట్ అనేది ఏ అభివృద్ధికైనా మూల ఇంధనం లాంటిది. ఇవాళ కరెంట్ లేకపోతే ప్రపంచమే అంధకారంలో ఉండేది.. దాన్ని గుర్తించి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రోగ్రెసివ్ పాలసీలు కావొచ్చు.. కెపాసిటీలు పెంచిన తీరు కావొచ్చు. దాదాపు లక్ష కోట్ల రూపాయలు విద్యుత్ రంగంపై ఖర్చు పెట్టిన తీరు కావొచ్చు. తదననుగుణంగా 20 వేల మెగావాట్ల కరెంట్ సామర్థ్యం పెరిగిన పరిస్థితి ఉందన్నారు. కరెంట్ కష్టాలు లేకుండా అటు పరిశ్రమలుకానీ, రైతులు కానీ, గృహస్తులు కానీ ఎవరికీ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా తయారు చేసిన పరిస్థితి. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రేవంత్ రెడ్డి అనే మహమ్మారి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలు ఎట్లైతే సర్వనాశనం అయ్యాయో.. కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది.. విధ్వంసానికి గురవుతుందన్న పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బాధతో వ్యక్తీకరిస్తోందన్నారు. తెలిసినవాడికి చెప్పొచ్చు.. తెలియని వాడికి చెప్పొచ్చు.. కానీ తెలిసీ తెలియని వాడికి చెప్పడం కష్టం. అది రేవంత్ రెడ్డి, ఆయన కేబినెట్, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
LIVE: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం @sravandasoju https://t.co/yF0aFeS2VV
— BRS Party (@BRSparty) October 15, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

