Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీలను పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీలను పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇటీవల ప్రారంభించిన కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఆర్థిక భారం కాకుండా, అందుబాటులో ఉండే ధరలను నిర్ణయించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం రోజువారీ కామన్ పాస్ ధర రూ.400గా ఉంది. ఇందులో మెట్రో వాటా రూ.300 కాగా, ఆర్టీసీ వాటా రూ.100గా నిర్ణయించారు. అదేవిధంగా నెలవారీ కామన్ పాస్ ధర రూ.8,500గా ఉండగా, ఇందులో మెట్రో వాటా రూ.7,000, ఆర్టీసీ వాటా రూ.1,500గా ఉంది. అయితే ఈ ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులకు భారంగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు కామన్ పాస్ ఛార్జీలను సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఛార్జీలపై పునఃపరిశీలన చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ అంశంపై త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతోపాటు ఆర్టీసీ, మెట్రో సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకునేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరేలా, వారి అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన ధరలతో కామన్ పాస్ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజలపై అదనపు ఛార్జీల భారం మోపడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, ప్రయాణికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే తగిన నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
Ramayana | ‘రామాయణ’ రెండో ట్రైలర్ దసరాకేనా.. అక్టోబర్ 20న మరో భారీ అప్డేట్!
Ram Charan | రామ్ చరణ్ – అనిరుధ్ కాంబినేషన్ ఫిక్స్.. క్రేజీ కాంబోపై భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

