చివరిచూపునకు వెళ్లినా నిర్బంధమే!
బీఆర్ఎస్ నేతలు చివరికి తమ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్నా కాంగ్రెస్ సర్కార్ జీర్ణించుకోలేకపోతున్నది. అడుగడుగునా నిర్బంధాలు ప్రయోగిస్తున్నది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సోమవారం ఇటువంటి నిర్బంధ వాతావరణమే చవిచూశారు.
- నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ నేత చెన్నప్ప మృతి
- ఓదార్పు కోసం బయలుదేరిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం
- పరిగి వద్ద అడ్డుకున్న పోలీసులు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
- తీవ్ర వాగ్వాదం తర్వాత నరేందర్‌రెడ్డికి పోలీసుల అనుమతి
- చెన్నప్ప మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన పట్నం
కోస్గి/గుండుమాల్/పరిగి, నవంబర్ 9 : బీఆర్ఎస్ నేతలు చివరికి తమ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్నా కాంగ్రెస్ సర్కార్ జీర్ణించుకోలేకపోతున్నది. అడుగడుగునా నిర్బంధాలు ప్రయోగిస్తున్నది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సోమవారం ఇటువంటి నిర్బంధ వాతావరణమే చవిచూశారు. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం అమ్లికుంటకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, ఉద్యమకారుడు ఎడ్ల చెన్నప్ప సోమవారం మృతిచెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే చెన్నప్పను కడసారి చూసేందుకు, వారి కుటుంబసభ్యులను ఓదార్చేందుకు నరేందర్‌రెడ్డి బయలుదేరారు. ఆయనను పోలీసులు పరిగిలో అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటి తరువాత నరేందర్‌రెడ్డిని పోలీసులు వదిలిపెట్టడంతో ఆయన అమ్లికుంటుకు చేరుకొని, చెన్నప్ప మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చా రు. అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు.
అనంతరం ఆయన మీడియా తో మాట్లాడతూ.. తెలంగాణ ఉద్యమంలో చెన్నప్ప చేసిన పోరాటం మరువలేనిదని చెప్పారు. తన నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందాడన్న వార్త తెలిసి, కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న తనను పరిగి వద్ద పోలీసులు అడ్డుకోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. మరణాలపై కూడా రాజకీయం చేస్తరా? అని మండిపడ్డారు. తనను పోలీసులు అడ్డుకున్న సమయంలో పరిగి వద్ద మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డితో కలిసి మీడియాతో నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ నాయకుడు చనిపోతే వారి కుటుంబానికి భరోసా కల్పించేందుకు వెళ్తున్న తనను అడ్డుకోవడం ఏందని ప్రశ్నించారు. తాను కూడా అడ్డుకోవాలనుకుంటే కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సభ పెట్టడని పేర్కొన్నారు. మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు చనిపోతే, కనీసం చావులకు కూడా పోనీయరా? అని సీఎంను ప్రశ్నించారు.
మూడు రోజుల నుంచి కొడంగల్‌లో సీఎం బలప్రదర్శన చేస్తున్నారని, మంత్రులు, ఎమ్మెల్యేలను తీసుకొచ్చి చూపిస్తున్న రేవంత్‌రెడ్డి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మూడు రోజులు సభలు పెట్టి కేసీఆర్ కుటుంబాన్ని, హరీశ్‌రావును తిట్టడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో మూడు రోజులపాటు జన్మదిన వేడుకల పేరిట రోజుకు రూ.50 కోట్ల చొప్పున సుమారు రూ.150 కోట్లు దుబారా ఖర్చు చేశారని విమర్శించారు. ఈ దుబారా ఖర్చుకు బదులు అదే రూ.150 కోట్లతో పరిగి లేదా కొడంగల్ నియోజకవర్గాల్లో రైతులకు సన్న వడ్లకు బోనస్, లేదా రైతుబంధు ఇస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం పర్యటనలో జిల్లాలోని ఎమ్మెల్యేలు ఆయన పక్కన నిలబడి ఫొటోలు దిగడం తప్ప, అభివృద్ధి కోసం ఏ ఒక్కరూ నిధులు అడుగడం లేదని దుయ్యబట్టారు.
ఫొటోలకు పోజులు ఇవ్వడం తప్ప పరిగి, తాండూరు, వికారాబాద్‌కు నిధులు తేవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులంటే కాంగ్రెస్‌కు భయం పట్టుకున్నదని ఎద్దేవా చేశారు. లగచర్లలో రైతుల పక్షాన పోరాడిన మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని 30 రోజులు జైల్లో పెట్టారని, పరిగి ప్రాంతంలో భూ సేకరణ వద్దంటూ రైతుల పక్షాన పోరాడితే తనపై అయిదారు కేసులు పెట్టారని పేర్కొన్నారు. పార్టీ నాయకుడు చనిపోతే వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న నరేందర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడాన్ని మహేశ్‌రెడ్డి ఖండించారు. కార్యకర్తల అంత్యక్రియలకు నరేందర్‌రెడ్డి వెళ్లేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్, మార్కెట్ మాజీ చైర్మన్లు సురేందర్, ఆంజనేయులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నరేందర్‌రెడ్డి అక్రమ అరెస్టు దుర్మార్గం: సబితాఇంద్రారెడ్డి
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): కోస్గిలో మరణించిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయ డం దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. కార్యకర్త కుటుంబా న్ని ఓదార్చేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేత ను నిర్బంధించడం సర్కార్ దమనకాండకు నిదర్శనమని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వం కక్ష సా ధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే జరుగబోయే పరిణామాలకు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

