హైదరాబాద్, ఆగస్టు 27, (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చేలా ఉన్నదని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ధ్వజమెత్తారు. రాజకీయ నాయకులను అరెస్టు చేయాలని చూడటం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం అణిచివేతకు గురవుతుంటే మేధావులు, ప్రజా సంఘాలు మౌ నంగా ఉండటం సరికాదని పేర్కొన్నారు.