Pochampally Ikat | పోచంపల్లి ఇక్కత్‌కు పరో పదేండ్లు భౌగోళిక గుర్తింపు
పోచంపల్లి ఇక్కత్ చేనేత ఉత్పత్తికి సంబంధించిన భౌగోళి గుర్తింపును మరో పదేండ్లకు పునరుద్ధరించారు. ఈ మేరకు జియోగ్రఫికల్ ఇండికేషన్స్ (జీఐ) ఏజెంట్ సుభాజిత్ సాహా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
Pochampally Ikat | హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): పోచంపల్లి ఇక్కత్ చేనేత ఉత్పత్తికి సంబంధించిన భౌగోళి గుర్తింపును మరో పదేండ్లకు పునరుద్ధరించారు. ఈ మేరకు జియోగ్రఫికల్ ఇండికేషన్స్ (జీఐ) ఏజెంట్ సుభాజిత్ సాహా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. భారతదేశ భౌగోళిక గుర్తింపు పొందిన మొట్టమొదటి చేనేత ఉత్పత్తి కేం ద్రం ‘పోచంపల్లి ఇక్కత్’ కావడం విశేషం. తొలిసారిగా 2004లో రిజిస్ట్రేషన్ పొందింది.
ఇదిలా ఉండగా, జీఐ చట్టం ప్రకారం భౌగోళిక గుర్తింపు అమలులో ఉండటానికి ప్రతి 10 ఏండ్లకు ఓసారి పునరుద్ధరించుకోవాల్సి ఉంది. దీంట్లోభాగంగా తాజాగా మరోసారి ఇక్కత్ జీఐని పునరుద్ధరించారని సాహా తెలిపారు. త్వరలోనే పోచంపల్లి ఇక్కత్ లోగో కూడా పునరుద్ధరణకు నోచుకుంటుందని ఆయన పేర్కొన్నారు. భౌగోళిక గుర్తింపు కోసం భారత్ నుంచి 15,000 కంటే ఎకువ ఉత్పత్తులకు అవకాశం ఉందని, ప్రస్తుతం 1,158 దరఖాస్తులు మాత్రమే జీఐ రిజిస్ట్రీలో నమోదు అయ్యాయని తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో 5000కంటే దరఖాస్తులు వచ్చే అవకాశముందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

