హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ స్థాయిలోనూ విద్యార్థులకు ఉద్యోగాలిచ్చే సంస్థలకు అనుసంధాన కర్తగా వ్యవహరించేందుకు ప్రత్యేకంగా ప్లేస్మెంట్ సెల్‌ను ఇంటర్ విద్య కమిషనరేట్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి ఓ అధికారిని కూడా నియమించారు. ఇంటర్‌విద్యలో సంస్కరణల్లో భాగంగా అకడమిక్ గైడెన్స్ సెల్‌ను ఇటీవలే ఏర్పాటు చేశారు.
ఇందులో అకడమిక్, ట్రైనింగ్స్, కెరీర్‌గైడెన్స్, ప్లేస్‌మెంట్స్ వంటి మూడు రకాల విభాగాలున్నాయి. ఇప్పటివరకు వొకేషనల్ కోర్సుల్లోని విద్యార్థులకు అప్రెంటీస్‌షిప్ మేళాలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు కల్పించే వారు. ఇక నుంచి ఈ పనులను అకడమిక్ గైడెన్స్సెల్లోని ప్లేస్‌మెంట్స్ విభాగం పర్యవేక్షిస్తున్నది. పాఠ్యపుస్తకాలు, కరికులం రూపకల్పన, అధ్యాపకులకు వృత్తిపరమైన శిక్షణ వంటి అంశాలను కూడా అకడమిక్ గైడెన్స్ సెల్ పరిశీలిస్తున్నది.