ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
ఇందిరమ్మ చీరల తయారీకి బిల్లుల గండం పొంచి ఉన్నది. ఈ ఏడు కోటి చీరల తయారీ కోసం ప్రభుత్వం రూ.450 కోట్లు కేటాయించింది. గత ఫిబ్రవరిలోనే పవర్లూమ్ కార్మికులకు ఆర్డర్లు కూడా ఇచ్చింది. ఇప్పటివరకు 8 నెలలు గడిచినా మొదటి, రెండో విడత బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
- తాజాగా రూ.450 కోట్లు కేటాయింపు
- సర్కార్‌పై కార్మికుల అపనమ్మకం
- చీరల ఉత్పత్తిని నిలిపివేస్తున్న వైనం
- ఇప్పటివరకు తయారైంది 65 లక్షలే
- ఇంకా కావాల్సింది 35 లక్షలు
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తేతెలంగాణ) : ఇందిరమ్మ చీరల తయారీకి బిల్లుల గండం పొంచి ఉన్నది. ఈ ఏడు కోటి చీరల తయారీ కోసం ప్రభుత్వం రూ.450 కోట్లు కేటాయించింది. గత ఫిబ్రవరిలోనే పవర్లూమ్ కార్మికులకు ఆర్డర్లు కూడా ఇచ్చింది. ఇప్పటివరకు 8 నెలలు గడిచినా మొదటి, రెండో విడత బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అసలు ఆ బిల్లులు మంజూరవుతాయో? లేదో? అన్న మీమాంస కార్మికులను వెంటాడుతున్నది. దీని ప్రభావం ఈ ఏడాది చీరల ఉత్పత్తిపై పడుతున్నది. కోటి చీరలకు గానూ ఇప్పటివరకు 65 లక్షల చీరలు తయారు కాగా, మిగతా 35 లక్షల తయారీకి కనీసం మరో 3 నెలలైనా పట్టే అవకాశం ఉన్నది. దీంతో ఇందిరాగాంధీ జయంతి అయిన నవంబర్ 19 నాటికి సమాఖ్య సంఘాల మహిళలకు చీరలు అందించాలనే సర్కార్ లక్ష్యం నెరవేరేలా లేదు.
రూ.120 కోట్ల బిల్లులు పెండింగ్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని బంద్ పెట్టింది. వీటికి బదులుగా గ్రామ సమాఖ్య సంఘాల్లోని 65 లక్షల మంది మహిళా సభ్యులకు ఏటా రెండు చీరల చొప్పున పంపిణీ చేస్తామని ప్రకటించింది. కానీ మూడేండ్ల పాలనలో నిరుడు పంచాయతీ ఎన్నికల ముందు ఒకే ఒకసారి చీరలను పంపిణీ చేసింది. మున్సిపాలిటీల పరిధిలోని లబ్ధిదారులకు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపింది. తాజాగా 2026 నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని చీరలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం రూ.450 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించింది. ఇటీవల సిరిసిల్ల పర్యటన సందర్భంగా రూ.141 కోట్లు పెండింగ్ బిల్లులు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. కానీ 2024కు సంబంధించిన రూ.60 కోట్లు, 2025కు సంబంధించిన మరో రూ.60 కోట్ల చీరల బిల్లులు మాత్రం ఇవ్వలేదని పవర్లూమ్ కార్మిక సంఘాల బాధ్యులు ఆవేదన చెందుతున్నారు.
కార్మికుల్లో అయోమయం
రెండు విడతల పెండింగ్ బిల్లులే ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం.. ఈసారి ఇందిరమ్మ చీరల బిల్లులు చెల్లిస్తుందో లేదోనని కార్మికులు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వంపై అపనమ్మకంతో చీరల ఉత్పత్తిని అర్ధాంతరంగా నిలిపివేస్తున్నారు. గత ఫిబ్రవరిలో కోటి చీరలకు ఆర్డర్లు ఇవ్వగా ఇప్పటివరకు 65 లక్షలు మాత్రమే తయారు చేశారు. సర్కార్ నిర్ధేశించిన గడువుకు మరో నాలుగు వారాలు మాత్రమే ఉండగా, మరో 35 లక్షల చీరలు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం మరో మూడు నెలలు పడుతుంది. అంటే నవంబర్ 19 నాటికి చీరలు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో చీరల పంపిణీ గడువును మరోసారి పొడిగించడం అనివార్యమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

