బస్సు నడుపుతుండగా గుండెపోటు.. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
ఆర్టీసీ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. ఇంత క్లిష్ట సమయంలోనూ డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు.
- సమయస్ఫూర్తితో రోడ్డు పక్కన వాహనాన్ని ఆపిన డ్రైవర్ లక్ష్మణ్
- మరో రెండు రోజుల్లోనే ఉద్యోగవిరమణ పొందనున్న లక్ష్మణ్
జగిత్యాల, ఆగస్టు 29 : ఆర్టీసీ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. ఇంత క్లిష్ట సమయంలోనూ డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుగ్గారం మండలం మద్దునూర్ నుంచి జగిత్యాలకు సుమారు 60 మంది ప్రయాణికులతో వస్తుండగా, డ్రైవర్ లక్ష్మణ్‌కు గుండెపోటు రాగా, బస్సు వేగాన్ని తగ్గిస్తూ జగిత్యాల-ధర్మపురి హైవే పక్కన ఆపి స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు.
వెంటనే ప్రయాణికులు, కండక్టర్ 108కు ఫోన్ చేయగా, స్పందన రాక స్థానికుల సహాయంతో ఆటోలో జిల్లా దవాఖానకు తరలించారు. అక్కడే చికిత్స చేస్తున్నారు. కొన్నిరోజులుగా ఆరోగ్యం బాగాలేదని, మరో 2 రోజుల్లో రిటైర్ అవుతున్న ఆయనకు బలవంతంగా డ్యూటీ వేశారని లక్ష్మణ్ బంధువులు వాపోయారు. లక్ష్మణ్ ముందు చూపుతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Arnab Cyclone | విశాఖలో మొదలైన అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. వీడియో
వసతి గృహాల్లో పరిశుభ్రతను పాటించాలి : ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ చందన
అక్రమ విద్యుత్ కనెక్షన్‌తో అటవీ జంతువులకు ఉచ్చు.. నలుగురిపై కేసు
Jio Platforms | జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్.. కీలకమైన అంశాలు ఇవే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

