డిండి ఎత్తిపోతలను ఆపండి
పాలమూరు లిఫ్ట్ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లు ఇచ్చేది లేదని ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రితోపాటు ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి నల్లగొండ జిల్లాకు నీళ్లు అందించేందుకు చేపట్టిన.. ఏదుల నుంచి డిండి పథకానికి స్వస్తి పలుకాలని సూచించారు. ఈ మేరకు ఓ మంత్రితోపాటు ఎమ్మెల్యేలు గురువారం సచివాలయంలో నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిశారు.
- పాలమూరు నుంచి నీళ్లు ఇచ్చేది లేదు.. తేల్చిచెప్పిన పాలమూరు మంత్రి, ఎమ్మెల్యేలు
- సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌తో భేటీ
- ఎస్ఎల్బీసీ లేదా సాగర్ నుంచి తీసుకోవాలని సూచన
మహబూబ్‌నగర్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు లిఫ్ట్ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లు ఇచ్చేది లేదని ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రితోపాటు ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి నల్లగొండ జిల్లాకు నీళ్లు అందించేందుకు చేపట్టిన.. ఏదుల నుంచి డిండి పథకానికి స్వస్తి పలుకాలని సూచించారు. ఈ మేరకు ఓ మంత్రితోపాటు ఎమ్మెల్యేలు గురువారం సచివాలయంలో నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిశారు.
డిండికి నీళ్లిచ్చే పథకాన్ని అంగీకరించేది లేదని వారు తేల్చిచెప్పినట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి డిండి ద్వారా నల్లగొండ జిల్లాకు నీళ్లు తరలించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు రూ.1,800 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించాలని సర్కార్ ఆదేశించింది. వనపర్తి జిల్లా ఏదుల రిజర్వాయర్ నుంచి నేరుగా కాలువ ద్వారా డిండి రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించి అక్కడి నుంచి నల్లగొండ జిల్లాకు సాగునీటిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రతిపాదించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి నల్లగొండ జిల్లాకు నీటి తరలించే విషయమై కొంతకాలంగా అధికార పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని గట్టిగా కోరినట్టు సమాచారం. ఇప్పటికే పాలమూరు జిల్లాకు నీళ్లు రావడంలేదని.. ఒకవేళ వచ్చిన నీటిని వచ్చినట్టే డిండికి తరలిస్తే మళ్లీ ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఊహించిన కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా సర్కార్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు.
అవసరమైతే నల్లగొండకు ఎస్ఎల్బీసీ లేదా నాగార్జునసాగర్ ద్వారా నీటిని పంపింగ్ చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో డిండి ఎత్తిపోతల పథకంపై ఇటు పాలమూరు అటు నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధుల మధ్య అగ్గి రాజేసినట్లయింది. అయితే డిండి ప్రతిపాదనను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ పథకాన్ని ఆపేస్తున్నామని ఉత్తమ్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

