Runa Mafi | రుణ విముక్తి కలగలే.. బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
‘నందిగామ మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్నవారు 33 మంది ఉండగా..12 మందికి మాత్రమే రుణమాఫీ అయింది.’
- రంగారెడ్డి జిల్లాలో రుణమాఫీ జాబితాలో వేల మంది రైతుల పేర్లు గల్లంతు
Runa Mafi | రంగారెడ్డి, జూలై 19(నమస్తే తెలంగాణ): నందిగామ మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్నవారు 33 మంది ఉండగా..12 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. చేగూరు పీఏసీఎస్‌లో రూ.లక్షలోపు రుణాలను 264 మంది తీసుకోగా.. అందులో 156 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. రుణ విముక్తి కలగని రైతులు రంగారెడ్డి జిల్లాలో పెద్ద మొత్తంలో ఉన్నట్టు తెలుస్తున్నది. జిల్లాలో 49,741 మంది రైతులకు రూ.278.06 కోట్ల రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
చాలా మంది రైతుల పేర్లు జాబితాలో గల్లంతయ్యాయని, అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ కాని కారణాలను తెలుసుకునేందుకు శుక్రవారం బ్యాం కులు, వ్యవసాయ కార్యాలయాలకు పరుగులు పెట్టారు. హైదరాబాద్ నుంచే జాబితాలు వచ్చాయని, తమకేమీ తెలియదని అధికారులు చెబుతున్నారు. మొదటి విడత పరిస్థితే ఇలా ఉంటే.. రెండు, మూడో విడత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రుణమాఫీకాని వాటిలోమచ్చుకు కొన్ని..
- నందిగామ మండలం మేకగూడ పీఏసీఎస్ పరిధిలో 306 మంది రైతులు రూ.లక్షలోపు రుణాలు తీసుకున్నారు. వీరిలో 181 మంది రైతులకే రుణమాఫీ అయింది.
- షాద్ నగర్ పీఏసీఎస్ పరిధిలో 313 మందికి రూ.లక్ష లోపు రుణమాఫీ వర్తించాల్సి ఉండగా.. కేవలం 174 మంది పేర్లే జాబితాలో ఉన్నాయి.
- కొందుర్గు పీఏసీఎస్ పరిధిలో 1,005 మందికి రూ.లక్ష రుణమాఫీ కావాల్సి ఉండగా 372 మందికే రుణమాఫీ జరిగినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
- కేశంపేట మండలం కొత్తపేట పీఏసీఎస్ పరిధిలో రూ.లక్ష రుణమాఫీకి 470 మంది అర్హులుకాగా..తొలి జాబితాలో 236 మందికే రుణ విముక్తి
కలిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

